గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 20 మార్చి 2017 (05:46 IST)

ఆ ఖర్మ నాకు పట్టనందుకు హాయిగా ఉందంటున్న కాజల్...!

చిత్రసీమలో చాన్స్ రావాలంటే రాజీ పడాల్సిందే అనేది ఈ మధ్య హీరోయిన్లే పేలుస్తున్న బాంబు. ఆ రాజీపడటం అంటే అర్థం ఏమిటో అందరికీ తెలిసిందే. అలాంటి కాంప్రమైజ్ కావలసిన అవసరం చిత్రసీమలో ఉందని ప్రముఖ కథానాయిక కాజల్ అగర్వాల్ సుతిమెత్తగా చెప్పారు కానీ తనకలాంటి ఖర

చిత్రసీమలో చాన్స్ రావాలంటే రాజీ పడాల్సిందే అనేది ఈ మధ్య హీరోయిన్లే పేలుస్తున్న బాంబు. ఆ రాజీపడటం అంటే అర్థం ఏమిటో అందరికీ తెలిసిందే. అలాంటి కాంప్రమైజ్ కావలసిన అవసరం చిత్రసీమలో ఉందని ప్రముఖ కథానాయిక కాజల్ అగర్వాల్ సుతిమెత్తగా చెప్పారు కానీ తనకలాంటి ఖర్మ పట్టలేదని, అందుకు చాలా సంతోషిస్తున్నానని చెప్పారు.
 
‘‘ఒక్క ఛాన్స్‌ కావాలా అయితే ‘అడ్జస్ట్‌’ అవ్వాలి. రాజీపడటానికి రెడీగా ఉండాలి’’... ఈ పురుషాధిక్య ప్రపంచంలో ఉద్యోగం చేయడానికి కాలు బయటపెట్టే మహిళల్లో చాలామందికి ఎదురయ్యే స్థితి ఇది. సినిమా పరిశ్రమలో ఈ పరిస్థితి కొంచెం ఎక్కువ ఉంటుందని చాలామంది అంటుంటారు. ఈ విషయం గురించి ఇటీవల కొంతమంది కథానాయికలు నిర్భయంగా మాట్లాడారు కూడా. వాళ్లల్లో కాజల్‌ అగర్వాల్‌ ఒకరు. 
 
కథానాయికల ‘కాంప్రమైజ్‌’ గురించి మీరేం చెబుతారు మీకలాంటి పరిస్థితి ఎదురైందా అనే ప్రశ్న కాజల్‌ అగర్వాల్‌ ముందుంచితే – ‘‘నిజానికి నాకలాంటి సిచ్యుయేషన్‌ ఎదురు కాలేదు. అయితే దాని గురించి విన్నాను. కొంతమంది హీరోయిన్లు తమకు ప్రతిభ ఉండి కూడా అవకాశాల కోసం ఎలా రాజీపడాల్సి వచ్చిందో చెప్పారు. అది బాధాకరం’’ అన్నారు. 
 
పాటల్లో కథానాయికలను అభ్యంతరకరంగా చూపించే విషయం గురించి ప్రస్తావిస్తే – ‘‘ఇది నాక్కూడా జరిగింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాకేం తెలిసేది కాదు. అందుకని అభ్యంతరకరంగా ఉండే దృశ్యాలు చేశాను. ఆ తర్వాత తప్పు తెలుసుకున్నాను. ఇక ఆ దారిలో వెళ్లకూడదని ఫిక్సయ్యాను. అప్పటి నుంచి పాత్రలను చాలా కేర్‌ఫుల్‌గా ఎంపిక చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఉన్న ఈ స్థాయి నాకు చాలా ఆనందంగా, సౌకర్యవంతంగా ఉంది. నాకేం నచ్చిందో అది చేసే హక్కు నాకుంది. ఎవరో కోసం రాజీపడటంలో అర్థం లేదని తెలుసుకున్నాను’’ అని కాజల్‌ అన్నారు.