గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 27 మార్చి 2017 (04:48 IST)

అక్కడ దీపిక.. ఇక్కడ అనుష్క.. నిలువెత్తు అంకిత భావం వీరి సొంతం

సంజయ్ లీలా దర్శకత్వంలో దీపిక ముఖ్య పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు నూటకి నూరు శాతం ఆమె పాటు పడుతోందని వినికిడి. రాణి పద్మిని చారిత్రకపాత్రలో ఒదిగి పోవడానికి ఆమె చరిత్రకు సంబంధించిన పుస్తకాలను తీవ్ర

దక్షిణాది చిత్ర పరిశ్రమలో అంకిత భావానికి, నటన పట్ల తపనకు ప్రతీకగా ఎవరిని చెప్పుకుంటాం. జేజెమ్మనే అని అందరూ ఒప్పుకుంటారు. అందం, అణకువ, వినయం, పాత్రకు జీవం పోయడం, వివాదాలకు ఆమడ దూరంలో ఉండటం.  గ్లామర్, డీ గ్లామర్ పాత్రలకు తేడా లేకుండా ఏ పాత్రకైనా అంగీకరించడమే కాక ఆ పాత్రలకు పూర్తిగా న్యాయం చేయడం అనుష్క సొంతం. పన్నెండేళ్లకు పైగా దక్షిణాది చిత్రసీమలో పని చేస్తున్నప్పటికీ కమిట్ అయిన ఛాన్స్‌కు భంగం కలిగించకుండా అంకిత భావాన్ని ఆచరణలో నిరూపించిన ఏకైన నటి అనుష్క. అరుంధతి, రుద్రమదేవి, సైజ్ జీరో, బాహుబలి ఎలాంటి పాత్రనైనా తన ప్రయత్న లోపం ఉందనే మచ్చకు దూరంగా బతికిన అనుష్క దక్షిణాది ప్రేక్షకులందరి హృదయాల్లో గౌరవాన్ని పొందిన నటి.
 
ఇలాంటి డెడికేషన్ కల నటి మాకూ ఉంది లేవోయ్ అంటోంది ఇప్పుడు బాలివుడ్. ఆమె ఎవరంటే దీపికా పడుకొనే. సంజయ్ లీలా దర్శకత్వంలో దీపిక ముఖ్య పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు నూటకి నూరు శాతం ఆమె పాటు పడుతోందని వినికిడి. రాణి పద్మిని చారిత్రకపాత్రలో ఒదిగి పోవడానికి ఆమె చరిత్రకు సంబంధించిన పుస్తకాలను తీవ్రంగా అధ్యయనం చేస్తున్నారుని చిత్ర యూనిట్ కొనియాడుతోంది.ఈ సినిమా తప్ప తనకు మరో ధ్యాస లేదన్నట్లుగా వ్యవహరిస్తున్న దీపిక అంటే చిత్ర యూనిట్ ప్రాణమిస్తోందట. షూటింగ్‌కి సెలవు పెట్టడం ఇష్టంలేక తాను కమిట్ అయిన ఉన్న ప్రతిష్టాత్మక ‘కాన్స్‌ చలన చిత్రోత్సవాల’ను సైతం వదులుకున్నారంటే ఆమె పద్మావతి సినిమాకు ఎంత కమిట్ అయ్యారో అర్థమవుతుందని  పద్మావతి బృందం చెబుతోంది.
 
దక్షిణాదిన అనుష్క, ఉత్తరాదిన దీపిక ఇద్దరూ సౌత్ ఇండియా నటులే, ఇంకా చెప్పాలంటే కర్నాటకు చెందిన వారే. రెండు విభిన్న ప్రాంతాల చిత్రసీమలను ఏలుతూ కూడా వ్యక్తి గౌరవాన్ని పోగొట్టుకోని ఇలాంటి నటులు కదా ఏ పరిశ్రమకైనా కావాల్సింది.