శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 16 సెప్టెంబరు 2016 (16:06 IST)

విడాకుల కోసం కోర్టుకెక్కిన ప్రియదర్శన్ - లిజి దంపతులు...

ప్రముఖ మలయాళ, హిందీ చిత్రాల దర్శకుడు ప్రియదర్శన్, మాజీ హీరోయిన్ లిజి పద్దెనిమిదేళ్ళ వైవాహిక జీవితం ముగిసింది. వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వీరిద్దరూ విడాకుల కోసం చైన్నె ఫ్యామిలీ

ప్రముఖ మలయాళ, హిందీ చిత్రాల దర్శకుడు ప్రియదర్శన్, మాజీ హీరోయిన్ లిజి పద్దెనిమిదేళ్ళ వైవాహిక జీవితం ముగిసింది. వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వీరిద్దరూ విడాకుల కోసం చైన్నె ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయాన్ని లిజి ఒక ప్రకటనలో ధృవీకరించారు. తాము విడాకులు తీసుకోవాలని అనుకుంటున్న విషయం తమ పిల్లలకు, బంధువులకు, స్నేహితులకు తెలిసిన విషయమేనని లిజి తెలిపారు. తమ జీవితంలో ఇది చాలా క్లిష్టమైన సమయమని, ఇంతకు మించి తమను ఇంకా వార్తల్లోకి లాగి తమ ఏకాంతానికి భంగం కలిగించవద్దని లిజి కోరారు. 
 
వాస్తవానికి చాలా సంవత్సరాల క్రితమే ప్రియదర్శన్ - లిజి మధ్య విభేదాలు వచ్చాయి. అప్పుడే వీరు విడిపోవాలని అనుకున్నారు. అయితే కమల్ హాసన్, గౌతమి, మోహన్‌లాల్, ఆయన భార్య చొరవతో ఇంతకాలం వీరి సంసారం గాడినట్టు కనిపించింది. అయితే ఇక తామిద్దరూ కలసి ఉండలేమని వీరిద్దరూ నిర్ణయించుకున్నారు. ప్రియదర్శన్, లిజి 1996లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కల్యాణి అనే కూతురు, సిద్దార్థ్ అనే కొడుకు ఉన్నారు. 
 
వారిద్దరూ విదేశాలలో చదువుకుంటున్నారు. లిజీ ''ఆత్మబంధం'' వంటి అనేక తెలుగు సినిమాలలో కూడా నటించారు. దర్శకుడు ప్రియదర్శన్ తెలుగులో ''నిర్ణయం'' చిత్రానికి దర్శకత్వం వహించారు. శుక్రవారం ఈ విషయాన్ని లిజీ అధికారికంగా ప్రకటించారు. ఇద్దరం ఫ్యామిలీ కోర్టులో విడాకుల పత్రాలమీద సంతకం చేశామని తెలిపింది. గత కొన్ని నెలలుగా ఈ ఇద్దరు విడిగానే ఉంటున్నారు.