Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అవార్డులు నూలుపోగుతో సమానం : చిరంజీవి

సోమవారం, 19 జూన్ 2017 (11:26 IST)

Widgets Magazine

తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్రవేసిన వారిని సన్మానించుకోవడంలో తప్పులేదనీ మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత కె.విశ్వనాథ్‌, గాయకుడు ఎస్‌.పి.బాలులను ఘనంగా సత్కరించారు. ఇందులో పాల్గొన్న చిరంజీవి మాట్లాడుతూ 'తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంటే "శంకరాభరణం"కి ముందు, ఆ తర్వాత అని చెప్పుకోవాల్సి ఉంటుందన్నారు. తెలుగు పరిశ్రమకు మైలురాయిలాంటి సినిమా అది అన్నారు. విశ్వనాథ్‌తో సినిమాలు చేశాను. నాకు క్లాసు, మాస్‌ ఇమేజ్‌ తీసుకొచ్చింది ఆయన సినిమాలే అని ఆయన ప్రకటించారు. 
 
ఇకపోతే "విశ్వనాథ్‌గారి దర్శకత్వంలో, బాలు గానంలో ఎన్నో విజయవంతమైన సినిమాలొచ్చాయి. వాళ్లని సత్కరించుకోవడం ఆనందంగా ఉంది. ఇలాంటి సన్మానాలు వారికి కొత్తేమీ కాదు. ఇవన్నీ వాళ్లకి నూలుపోగుతో సమానం" అని అన్నారు. అనంతరం కె.విశ్వనాథ్‌ మాట్లాడుతూ 'అవార్డు వచ్చిందని నేనీ సన్మానానికి రాలేదు. సాధారణమైన వ్యక్తిగా వచ్చా. దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు నాకు ఇప్పుడు వచ్చింది. రేపు ఇంకొకరికి వస్తుంది. ఎప్పటికీ నేను కాశీనాథుని విశ్వనాథ్‌నే' అని వినమ్రయంగా చెప్పారు. 
 
ఆ తర్వాత గానగంధర్వుడు ఎస్.పి.బాలు మాట్లాడుతూ... 'తెలుగు సినిమాతో 51 ఏళ్ల అనుబంధం నాది. ఇంతకాలం నన్ను భరించి ఆదరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. అన్నయ్య విశ్వనాథ్‌గారి పక్కన కూర్కొని సన్మానం అందుకోవడం గర్వంగా ఉంది' అని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు హీరోలు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ప్రేమ విఫలం.. ఫినాయిల్ తాగి నటుడి ఆత్మహత్యాయత్నం

ప్రేమ విఫలం కావడంతో ఓ నటుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన నివాసంలోనే ఫినాయిల్ ...

news

బ్రహ్మానందం ఆస్తుల విలువ రూ.320 కోట్లు.. జాతీయ మీడియాలో ప్రచారం

తెలుగు చిత్ర పరిశ్రమలో మూడు దశాబ్దాలుగా హాస్యనటుడిగా వెలుగొందుతున్న నటుడు బ్రహ్మానందం. ...

news

ఉయ్యాలవాడలో ముగ్గురు హీరోయిన్లా.. నేషనల్‌కి ఐశ్వర్యారాయ్, ఇంటర్నేషనల్‌కి ప్రియాంక.. అది చరిత్రేనా..

ప్రథమ భారత స్వాతంత్ర్య పోరాటం జరగడానికి పది సంవత్సరాల ముందే రాయలసీమలో బ్రిటిష్ వారికి ...

news

సంఘమిత్రకు ఎవరూ దొరకలేదట.. అనుష్క వద్దంది.. నయనతారను అడుక్కుంటున్నారు

ఏ ముహూర్తంలో చారిత్రాత్మక చిత్రం సంఘమిత్రను ప్రారంభించాలని తలపెట్టారో గానీ ఆ రోజునుంచి ...

Widgets Magazine