గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 10 అక్టోబరు 2015 (14:55 IST)

బెంగాల్ టైగర్‌లో రాశిఖన్నా లుక్ ఎలా వుంటుందంటే..?

మాస్ మహారాజు రవితేజ బెంగాల్ టైగర్ సినిమాకు సంబంధించిన నటీనటుల లుక్స్ ఈ మధ్య సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే రవితేజ, తమన్నాల బెంగాల్ టైగర్‌కు సంబంధించిన లుక్స్‌కు విపరీతమైన క్రేజ్ లభించన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో తాజాగా రాశి ఖన్నా లుక్ అదిరిపోయింది.

అచ్చం తెలుగమ్మాయిలా రాశిఖన్నా మెరిసిపోయింది. పవర్‌ సినిమాలో రెజీనా తరహాలో బెంగాల్ టైగర్లో మాస్ మహారాజాతో కలిసి రాశి ఖన్నా రొమాన్స్ చేయనుంది. ఇప్పటికే తమన్నా బెంగాల్ టైగర్లో మెయిన్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో బెంగాల్ టైగర్ దర్శకుడు సంపత్.. నటీనటుల లుక్స్ విడుదలకు ముందు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. అంతేగాకుండా పాత్రలకు అనుగుణంగా తారల నుంచి నటనను రాబట్టేందుకు సంపత్ నంది తీవ్రంగా కృషి చేస్తున్నారు. కాగా బెంగాల్ టైగర్ ఆడియో వేడుక అక్టోబర్ 18వ తేదీన రిలీజ్ కానుంది. సినిమా దీపావళి కానుకగా నవంబర్ ఐదో తేదీన విడుదలయ్యే ఛాన్సుంది.