శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 24 అక్టోబరు 2015 (15:40 IST)

కొత్త బాయ్‌ప్రెండ్‌తో ఫ్రిదా పింటో: రోనీతో లిప్ కిస్.. ఇదే హాట్ న్యూస్!

''స్లమ్‌డాగ్ మిలియనీర్'' భామ మళ్లీ కొత్త బాయ్ ఫ్రెండ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. హాలీవుడ్ కథానాయిక ఫ్రిదా పింటో తాజాగా పోలో ప్లేయర్ రోనీ బార్‌కార్డితో ప్రేమాయణం సాగిస్తోంది. వీరిద్దరు కలిసి లిప్ టు లిప్ కిస్ చేసిన ఫొటో ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తోంది. 'స్లమ్‌డాగ్ మిలియనీర్' సినిమాతో 2008లో హాలీవుడ్‌కు పరిచయమైన ఫ్రిదా పింటో.. ఆ సినిమాలో తన సహ నటుడు దేవ్ పటేల్‌తో ఆరేళ్లు డేటింగ్ చేసింది.
 
అయితే దేవ్ పటేల్‌తో ఏమైందో ఏమోకానీ వారి ప్రేమాయణ వారి ప్రేమబంధం ఇటీవలే బ్రేకప్ అయింది. ఈ నేపథ్యంలో రోనీ బార్‌కార్డితో సన్నిహితంగా మెలుగుతున్న పింటో.. అతన్ని ఆలింగనం చేసుకొని లిప్ కిస్ ఇచ్చిన ఫోటో హాట్ న్యూస్‌గా మారింది. స్లమ్ డాగ్ మిలియనీర్‌తో మంచి పేరు కొట్టేసిన ఫ్రిదా పింటో బాండ్ గర్ల్‌ స్థాయికి ఎదిగింది. స్థాయికి తగ్గట్టే ఇప్పటికీ ఇద్దరితో ప్రేమాయణాన్ని బ్రేకప్ చేసుకుంది.