గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 31 జులై 2015 (18:53 IST)

పవర్ స్టార్ 'సర్దార్' ఫస్ట్‌లుక్ అదుర్స్..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం 'సర్దార్'. టాలీవుడ్‌లో ఇప్పుడు 'సర్దార్' హాట్ టాపిక్‌గా మారింది. గతంలో పవన్ నటించిన 'గబ్బర్ సింగ్' చిత్రం ఏ స్థాయిలో హిట్టు సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ చిత్రానికి స్వీక్వెల్‌గా 'గబ్బర్ సింగ్ -2' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్రం పేరును 'సర్దార్‌'గా మార్చారు. ఇప్పుడు ఈ చిత్రం షూటింగ్ జోరుగా సాగుతోంది.
 
ఈ స్థితిలో తాజాగా ఈ సినిమా నిర్మాత శరత్ మరార్ 'సర్దార్' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ని ట్విట్టర్ ద్వారా విడుదల చేశాడు. ఈ స్టిల్‌ని పవన్ కల్యాణ్ తన అభిమానుల కోసం స్వయంగా డిజైన్ చేసి, షూట్ చేశాడని ఆయన చెప్పారు. ఈ స్టిల్‌లో ఒకవైపున పోలీస్ ఆఫీసర్.. మరో వైపున గుర్రం తల భాగం.. మధ్యలో నుంచి కనిపిస్తూ కాస్త దూరంగా రౌడీ గ్యాంగ్ కనిపిస్తూ అదరగొట్టేస్తుంది.