Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మీ బామ్మర్ధికో న్యాయం.. నాకో న్యాయమా? చంద్రబాబుపై 'రుద్రమదేవి' గుణశేఖర్ డైరక్ట్ అటాక్

బుధవారం, 11 జనవరి 2017 (06:38 IST)

Widgets Magazine
gunasekhar

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై టాలీవుడ్ దర్శకుడు గుణశేఖర్ మండిపడ్డారు. బాలయ్య నటించిన వందో చిత్రం "గౌతమిపుత్రశాతకర్ణి"కి తెలంగాణ ప్రభుత్వంతో పాటు.. ఏపీ సర్కారు వినోదపు పన్ను నుంచి మినహాయింపు ఇచ్చింది. ఇది ఇపుడు వివాదాస్పదంగా మారింది. ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఆసరాగా చేసుకుని చంద్రబాబుపై గుణశేఖర్ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. 
 
2015లో గుణశేఖర్ కాకతీయుల వీరనారి రుద్రదేవి జీవితగాథ ఆధారంగా 'రుద్రమదేవి' చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం వినోదనపు పన్నుని మినహాయించింది. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ఇంకా పరిశీలనలోనే ఉంచింది. ఇప్పుడు 'గౌతమిపుత్ర శాతకర్ణి' నిర్మాతలు అడగ్గానే ఈ చిత్రానికి పన్ను మినహాయింపు ప్రకటిస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. 
 
ఈ నేపథ్యంలో ఇదే సరైనసమయమని భావించిన దర్శకుడు గుణశేఖర్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బహిరంగ లేఖ రాశారు. 'రుద్రమదేవి' చిత్రంపై వినోదపు రాయితీ విషయాన్ని మరోసారి పరిశీలించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖ కాపీని సోషల్ మీడియాలోనూ ఉంచారు. దీంతో ఇప్పుడీవ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. మరీ.. గుణశేఖర్ వినతిపై చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
gunasekhar' open letter
 
కాగా, బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' ఈ సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుజాతి ఔనత్యాన్ని, గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప తెలుగు చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి జీవిత గాధ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'ఖైదీ' మూవీ.. సంక్రాంతిన 'అమ్మ చనిపోయినంత బాధంటూ'.. పృథ్వీ కామెంట్స్.. సొల్యూషన్ చెప్పిన చిరు

మెగాస్టార్ చిరంజీవి నటించిన "ఖైదీ నంబర్ 150"వ చిత్రంలో తాను నటించిన కొన్ని సన్నివేశాలను ...

news

#BossIsBackfestival : 'కత్తి' శీనుతో "ఖైదీ నంబర్ 150" స్టార్ట్... డ్యాన్సుల్లో అదే దూకుడు

డేరింగ్‌, డాషింగ్‌, డైనమిక్‌ హీరోగా తెలుగు ప్రేక్షకుల్ని తన సినిమాలో ఉర్రూతలూగించి ...

news

మెగాస్టార్ షో స్టార్ట్.... 'ఖైదీ నెంబర్‌ 150' ప్రత్యేక ప్రదర్శన ప్రారంభం.. టాకేంటి?

తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ షో స్టార్ట్ అయింది. ఆయన నటించిన తాజా చిత్రం ఖైదీ నంబర్ 150 ...

news

మూగవోయిన బ్రాహ్మణి : గాల్లో తేలిపోతున్న క్రిష్

నందమూరి బాలకృష్ట వందవ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ప్రీవ్యూ చూసిన బాలయ్య కుమార్తె ...

Widgets Magazine