శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 9 సెప్టెంబరు 2015 (13:04 IST)

జాలీ ఎల్ఎల్‌బీ తమిళ రీమేక్‌లో టీచర్ పాత్రలో హన్సిక!

బాలీవుడ్ సినిమా జాలీ ఎల్ఎల్‌‍బీ తమిళ రీమేక్‌లో బొద్దుగుమ్మ హన్సిక టీచర్‌ రోల్‌ పోషిస్తోంది. టాలీవుడ్‌లో ఆఫర్లు సన్నగిల్లినా, కోలీవుడ్‌లో అగ్రనాయకిగా రాణిస్తున్న హన్సిక.. బాలీవుడ్ చిత్రం జాలీ ఎల్ఎల్‌బీ తమిళ రీమేక్‌లో నటించేందుకు ఓకే చెప్పేసింది. వినోదాత్మక కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు చక్కని విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాను తమిళంలో ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా రీమేక్ చేస్తున్నారు. 
 
హిందీలో పాత్ర నిడివి తక్కువే అయినా తమిళంలో హన్సికను ఉన్న ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని పరిధిని విస్తరించినట్లు సమాచారం. ఈ పాత్ర శక్తివంతం కావడంతో హన్సిక ఈ సినిమా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ నెలలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఉపాధ్యాయ వృత్తి అంటే తనకు చాలా ఇష్టమని అందుకే ఈ సినిమాలో ఉండేందుకు నటిస్తున్నానని చెప్పింది.