గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: గురువారం, 11 ఫిబ్రవరి 2016 (19:03 IST)

జై బాలయ్య అనుకోలేదు: హను

ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్‌ ఎంటర్టైన్మెంట్‌ బ్యానర్‌ పైన నాని, మెహరీన్‌ హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం 'కృష్ణగాడి వీర ప్రేమగాథ'. 'అందాల రాక్షసి'తో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన హను రాఘవపూడి ఈ చిత్రాన్ని డైరెక్ట్‌ చేస్తున్నారు. ఈ చిత్రంలో నాని హీరో బాలకృష్ణ ఫ్యాన్‌. అందుకే జై బాలయ్య అని టైటిల్‌ పెడుతున్నట్లు మొదట్లో వచ్చినా.. అలా పెట్టాలని నిర్ణయించలేదు. కథ ప్రకారమే 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' అనుకున్నామని దర్శకుడు హను తెలియజేస్తున్నారు.
 
ఈ సినిమాలో నాని, బాలయ్య అభిమానిగా కనిపిస్తాడు. అయితే 'జై బాలయ్య' అనే టైటిల్‌ వినపడింది కానీ మేం ముందు నుండి జై బాలయ్య అనే టైటిల్‌ అనుకోలేదు. సినిమాలో ఫ్యాక్షన్‌ ఉంటుంది కానీ పునాదిలా ఉంటుంది. అంటే ఇంటి పునాది మనకు కనపడదు కదా, అలాగే ఇందులో కనపడదు. అక్కడి మనుషులు, పరిస్థితులను చూపించాం అని చెప్పారు. ఈ శుక్రవారమే ఈ చిత్రం విడుదలవుతుంది.