Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కాజల్ అగర్వాల్‌‌ బర్త్ డేకు రానా స్పెషల్ గిఫ్ట్- కళ్లకు గంతలు కట్టి ఆభరణాలు తొడిగాడు.. (వీడియో)

సోమవారం, 19 జూన్ 2017 (17:38 IST)

Widgets Magazine

చందమామ హీరోయిన్, టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన కాజల్ అగర్వాల్‌కు జూన్ 19వ తేదీ పుట్టిన రోజు. ఈ రోజున రానా దగ్గుబాటి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. నిజమే. రానా కాజల్ అగర్వాల్‌కు గంతలు కట్టి ఆభరణాలు తొడిగాడు. ఇదేదో రియల్ సీన్ కాదు.. రీల్ సీన్‌లో. ఇంతకీ విషయం ఏమిటంటే? కాజల్ అగర్వాల్ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆమె నటిస్తున్న ''నేనే రాజు నేనే మంత్రి'' సినిమా నుంచి ఓ ప్రత్యేక టీజర్‌ను విడుదల చేశారు. 
 
ఈ సినిమాలో హీరోగా న‌టిస్తోన్న రానా.. ఈ టీజ‌ర్‌లో కాజల్‌ కళ్లకు గంతలు కట్టి ఆభరణాలు వేస్తాడు. అనంత‌రం ఆమె కళ్లకు క‌ట్టిన గంత‌లు తీసి దీపాల‌తో వెలిగిపోతున్న భ‌వ‌నంలోకి తీసుకెళ‌తాడు. ‘నా పేరు రాధా జోగేంద్ర. రాధ లేనిదే జోగేంద్ర లేడు’ అని రానా ఓ డైలాగ్ చెప్తాడు. ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
కాగా తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ లక్ష్మీ కల్యాణం సినిమాతో కాజ‌ల్ అగర్వాల్ టాలీవుడ్‌లో తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్ నటించే ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం ఆమెకు 50వ సినిమా కావడం.. ఆ సినిమాకు తేజానే దర్శకత్వం వహించడం విశేషం.

 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సాయిపల్లవి ఎంబీబీఎస్ చంపేస్తుందట... ఎలాగో తెలుసా?

"ప్రేమమ్" సినిమా తెలుగులో నాగ చైతన్య కెరీర్‌లో చాలాకాలం నిరీక్షణ తర్వాత పెద్ద హిట్టుగా ...

news

పవన్ కళ్యాణ్ గడ్డి పీక్కోవడం చూశానంటున్న నటుడు...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పగానే మెగా ఫ్యామిలీలో ఓ డిఫరెంట్ వ్యక్తి అని ...

news

పెళ్లి కాలేదు... లవర్ లేడు... ప్రెగ్నెంటట... కాజల్ ఏమన్నదో తెలుసా?

సినీ నటులపై ఎవరు ఎలా పుట్టిస్తారో కానీ గాసిప్స్ ఓ రేంజిలా లాగించేస్తుంటారు. తాజాగా నటి ...

news

రాజ్ తరుణ్ ఫుడ్ లేకుండా 13 రోజులు పేవ్‌మెంట్ మీదున్నాడు... రాజారవీంద్ర

యువ హీరో రాజ్ తరుణ్ ఏదో అలా వచ్చి హీరో అయిపోయాడు కదా అని అందరూ వస్తే అవ్వరంటూ నటుడు రాజా ...

Widgets Magazine