Widgets Magazine

హ్యాపీ బర్త్ డే టు విక్టరీ వెంకటేష్ : యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు..

బుధవారం, 13 డిశెంబరు 2017 (09:31 IST)

తెలుగు చిత్రపరిశ్రమలోని సీనియర్ హీరోల్లో ఒకరు విక్టరీ వెంకటేష్. సక్సెస్‌ఫుల్ సినిమాలతో విక్టరీనే తన ఇంటిపేరుగా మార్చుకున్న వెంకీ... వైవిద్యభరితమైన సినిమాల్లో నటిస్తూ యువ హీరోలతో పోటీపడుతున్నాడు. ఈ సీనియర్ హీరో పుట్టినరోజు వేడుకలను బుధవారం జరుపుకుంటున్నాడు.
venkatesh
 
1960 డిసెంబర్ 13వ తేదీన జన్మించిన వెంకి 1986లో 'కలియుగ పాండవులు' సినిమాతో మూవీ మోఘల్ రామానాయుడి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో ఇక వెంకీ వెనక్కి చూడలేదు. ఆ తర్వాత ఆయన నటించిన అనేక చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఆయన కెరీర్‌లో ఐదు నంది అవార్డులు అందుకున్నాడు. 
 
'కలిసుందాం రా.., నువ్వునాకు నచ్చావ్, ఆడవారి మాటలకు అర్ధాలేవేరులే' వంటి ఫ్యామిలీ సినిమాలేకాకుండా.. 'శత్రువు, బొబ్బిలిరాజా, క్షణం క్షణం ఘర్షణ' వంటి యాక్షన్.. 'ప్రేమ, చంటి, ప్రేమించుకుందాం..రా, ప్రేమంటే ఇదేరా, ప్రేమతో.. రా' వంటి లవ్ స్టోరీలతో తిరుగులేని విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. తక్కువ బడ్జెట్ చిత్రాలైన 'ఈనాడు, దృశ్యం, గురు' వంటి చిత్రాల్లో నటించి మంచి హిట్స్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. 
 
ఏమాత్రం భేషజాలకు పోనీ ఈ సీనియర్ హీరో 1985 డిసెంబర్ 13న నీరజను పెళ్లి చేసుకున్నారు. ఇంకో విషయం ఏమిటంటే వెరైటీగా ఆయన బర్త్ డే రోజునే (డిసెంబర్ -13 ) మ్యారేజ్ చేసుకున్న వెంకీకి ముగ్గురు కూతుళ్లు, కొడుకు. ఇలా ఏం చేసినా వెరైటీగా ఉండేలా ప్లాన్ చేసుకునే వెంకీ.. సినిమాల ఎంపికలోనూ సక్సెస్ అయ్యారు. 
 
అదేసమయంలో ఏఎన్నార్, ఎన్టీఆర్, శోభన్ బాబు తర్వాత కనుమరుగైపోయిన మల్టీస్టారర్ సినిమాలకు తొలిసారి పచ్చజెండా ఊపింది కూడా వెంకీనే. ప్రిన్స్ మహేష్ బాబుతో 'సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు', యువ హీరో రామ్‌తో 'మసాలా', పవన్ కళ్యాణ్‌తో 'గోపాల గోపాల' వంటి చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో 'ఆట నాదే వేట నాదే' ఆనే సినిమాలో నటిస్తున్న విక్టరీ వెంకటేష్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  
Tollywood Hero D.rama Naidu Happy Birthday Victory Venkatesh

Loading comments ...

తెలుగు సినిమా

news

లక్ష్మీపార్వతీ బండారం ఏంటో తెలుగు ప్రజలకు తెలిసిపోద్ది: కేతిరెడ్డి

లక్ష్మీస్ వీరగ్రంథం చిత్ర దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ...

news

దర్శకేంద్రుడు మెచ్చిన 'మళ్ళీరావా'

శ్రీ నక్కా యాదగిరి స్వామి ఆశీస్సులతో స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సుమంత్, ఆకాంక్ష ...

news

అనుష్క కోసం విరాట్ కోహ్లీ పాట (వీడియో)

టీమిండియా కెప్టెన్, విరాట్ కోహ్లీ, ఫిల్మ్ స్టార్ అనుష్క శర్మ వివాహం చేసుకున్నారు. విరాట్, ...

news

ఏదైనా పని ఇవ్వాలంటూ ప్రాధేయపడుతున్న బాలీవుడ్ నటి

ఒకపుడు టీవీ రంగంలో ఓ వెలుగు వెలిగిన ఓ సీనియర్ నటి ఇపుడు అవకాశాల కోసం తొక్కని గడపంటూ లేదు. ...