శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: సోమవారం, 5 అక్టోబరు 2015 (15:18 IST)

5000 మంది అమ్మాయిల నుంచి నెగ్గిన షాహిదా... సల్మాన్‌తో కలిసి రూ.626 కోట్ల వసూళ్లు...

భజరంగీ భాయీజాన్ చిత్రం చూస్తుంటే అందులో షాహిదా పాత్ర పోషించిన క్యూటెస్ట్ గర్ల్ షాహిదా(మున్నీ)... అసలు పేరు హర్షాలీ మల్హోత్రా నటన ఆకట్టుకుంటుంది. ఈ చిన్నారి జూన్ 3, 2008లో జన్మించింది. 2014లో ఓ టెలీఫిలిమ్‌లో నటించింది. ఐతే కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కే భజరంగీ భాయిజాన్ చిత్రంలో మాటలు రాని మూగ వికలాంగురాలి పాత్రలో నటించేందుకు పోటీ జరిగింది. ఈ పోటీలో హర్షల్ మల్హోత్రా కూడా పాల్గొన్నది. భజరంగీ భాయిజాన్ చిత్రంలో కీలక పాత్ర అయిన ఈ పాత్రలో నటించేందుకు ఈ చిన్నారితో పాటు మొత్తం 5000 మంది పాల్గొన్నారు. 
 
ఐతే చిట్టచివరికి ఆడిషన్లో మల్హోత్రా నెగ్గింది. పాత్రలో నటించేందుకు ఎంపికైన ఈ చిన్నారి తన నటనలో కూడా నెంబర్ వన్ అనిపించుకుంది. భజరంగీ భాయిజాన్ చిత్రంలో ఆసాంతం ఒక్క మాట కూడా మాట్లాడకుండా నటిస్తూ కోట్లమంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. పాకిస్తాన్ బాలిక పాత్రలో నటించిన మల్హోత్రాకు ఇప్పుడు చేతినిండా సనిమాలున్నాయి. 
 
భజరంగీ భాయిజాన్ చిత్రం 90 కోట్ల రూపాయల బడ్జెట్టుతో తెరకెక్కగా ఇప్పటివరకూ రూ. 626 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రానికి కథ తెలుగు దర్శక సంచలనం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందించారు. ఈ చిత్రాన్ని నిర్మించింది సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్. ఈ చిత్రంతో సల్మాన్ ఖాన్ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు.