Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మెగా ఫ్యామిలీ నటవారసుడు ఆ హీరో : బాలకృష్ణ

శనివారం, 27 జనవరి 2018 (18:21 IST)

Widgets Magazine
vvv - bala - sai

మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్‌పై హీరో బాలకృష్ణ ప్రశంసల వర్షం కురిపించారు. సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో సి.కళ్యాణ్‌ నిర్మిస్తున్న చిత్రం 'ఇంటిలిజెంట్‌'. ఈ చిత్రం టీజర్‌ను బాలయ్య బాబు శనివారం విడుదల చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుడు వి.వి.వినాయక్‌. ఆయన దర్శకత్వంలో మెగా ఫ్యామిలీ నుంచి మరో నటవారసుడు సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా రూపొందిన చిత్రం 'ఇంటిలిజెంట్‌'. ఈ సినిమా టీజర్‌ని నా చేతుల మీదుగా రిలీజ్‌ చేయడం చాలా సంతోషంగా వుందన్నారు. 
 
ఇకపోతే, 'సీకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌లో మా సి.కళ్యాణ్‌గారు వి.వి.వినాయక్‌ దర్శకత్వలో నిర్మిస్తున్న నాలుగో సినిమా ఇది. వినాయక్‌ కాంబినేషన్‌లో ఇంతకుముందు 'చెన్నకేశవరెడ్డి' సినిమా చేశాం. మన కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడు అని అడుగుతుంటాను. సినిమా విషయంలో ఆయన ఇన్‌వాల్వ్‌మెంట్‌, కలుపుగోలుతనం, ఆర్టిస్టు నుంచి సరైన పెర్‌ఫార్మెన్స్‌ రాబట్టుకోవడం నాకు ఎంతగానో నచ్చుతాయని చెప్పారు. 
 
ఈ సినిమా విషయానికి వస్తే వినాయక్‌, శివ కాంబినేషన్‌లో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. ఈ సినిమా టీజర్‌ చాలా బాగుంది. మిస్టీరియస్‌గా వుంది. టీజర్‌ చూసిన తర్వాత సినిమా ఎప్పుడు చూడాలా అనిపిస్తుంది. ముఖ్యంగా యూత్‌కి ఈ సినిమా కనెక్ట్‌ అవుతుంది. సినిమా ఘనవిజయం సాధిస్తుందని తెలిపారు. 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

జీఎస్టీ అశ్లీలం కాదు... ఆధ్యాత్మిక ఆరాధన : రాంగోపాల్ వర్మ

గాడ్ సెక్స్ అండ్ ట్రుత్(జీఎస్టీ) అంటే అశ్లీలం కాదనీ, ఓ ఆధ్యాత్మిక చింతన, ఆరాధన అని ...

news

#InttelligentTeaser : పేదోడికి ఫ్లాట్‌ఫాం.. ధర్మాభాయ్.కామ్ అంటున్న సాయి ధరమ్ తేజ్

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం "ఇంటిలిజెంట్". ఈ చిత్రం టీజర్ ...

news

తెలుగు ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న వ్యక్తులు ఉన్నారా? - నయనతార

హీరోల కన్నా కొంతమంది హీరోయిన్లే ఎక్కువగా కొన్ని విషయాల్లో తలదూరుస్తూ అనవసరంగా ...

news

'సైరా'గా మారిన దర్శకుడు కుమారుడు

తెలుగు తొలి స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా మెగాస్టార్ ...

Widgets Magazine