Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తమిళ హీరో ధనుష్‌కు ఊరట... మదురై వృద్ధదంపతుల పిటీషన్ కొట్టివేత...

శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (12:21 IST)

Widgets Magazine
Dhanush

తమిళ హీరో ధనుష్‌కు కోర్టులో భారీ ఊరట లభించింది. ధనుష్ తమ కొడుకేనని, తమ బాగోగులు చూసుకోవటం లేదని పేర్కొంటూ మదురై జిల్లా మేలూర్‌కు చెందిన ఓ వృద్ధ దంపతులు కోర్టుకెక్కిన విషయం తెల్సిందే. ఈ కేసులో శుక్రవారం మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ తుది తీర్పు వెల్లడించింది. వృద్ధ దంపతులు దాఖలు చేసుకున్న పిటీషన్‌ను కోర్టు కొట్టివేసింది. 
 
హీరో ధనుష్ ఇంతకు క్రితమే తాను వాళ్ల కొడుకును కాదని, తాను 1983లో జులై 28న ఎగ్మోర్ ప్రభుత్వ ఆస్పత్రిలో కృష్ణమూర్తి, విజయలక్ష్మి దంపతులకు జన్మించానని, అప్పట్లో తన పేరు వెంకటేశ్ ప్రభు అని, సినిమాల్లోకి వచ్చాక ధనుష్‌ కె.రాజాగా పేరు మార్చుకున్నానని మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. 
 
దీనికి బదులుగా ఆ దంపతులు.. ధనుష్ 1985 నవంబర్7న మదురైలోని ప్రభుత్వ రాజాజీ ఆస్పత్రిలో జన్మించాడని తమ వద్ద ఆధారాలున్నాయని కౌంటర్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. ఇరువురు జనన ధృవీకరణ, విద్యా సంబంధ పత్రాలను సమర్పించాలని ఆదేశించింది. వీటన్నింటితో పాటు.. వైద్య రిపోర్టులు పరిశీలించిన కోర్టు వృద్ధదంపతుల పిటీషన్‌ను కొట్టివేసింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

వెండితెరపై మరో అద్భుతం.. నిన్నే పెళ్లాడుతా, మన్మధుడు కలిపితే.. "రారండోయ్ వేడుక చూద్దాం"

నాగార్జున కెరీర్లో శివ ఒక ట్రెండ్ సెట్టర్ అయితే, నిన్నే పెళ్లాడుతా, మన్మధుడు అత్యద్భుతమైన ...

news

బాహుబలితో రెఢీ అంటో వెంకటాపురం.. హ్యాపీడేస్ రాహుల్ కొత్త సినిమా?!

ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి మానియా నడుస్తోంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 28వ తేదీన ...

news

మగధీరతో స్టార్ట్.. బాహుబలితో పీక్... తెలుగు సినిమాకు ఇది గ్రాఫిక్స్ స్వర్ణయుగం

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ‘మగధీర’ తర్వాత గ్రాఫిక్స్‌కు నిర్మాతలు కొంత బడ్జెట్‌ ...

news

రాంగోపాల్ వర్మకు సన్నీ లియోన్.. ఆ నోరు కంటే పబ్లిక్ టాయ్‌లెట్టే నయం...

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు పోర్న్‌స్టార్ సన్నీ లియోన్ గూబగుయ్యమనేలా రివర్స్ ...

Widgets Magazine