శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By dv
Last Updated : సోమవారం, 27 జూన్ 2016 (16:47 IST)

నందు 'కన్నుల్లో నీ రూపమే' ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

యంగ్ హీరో నందు, క్యూట్ గాళ్ తేజస్విని ప్రకాశ్ జంటగా తెరకెక్కుతున్న 'కన్నుల్లో నీ రూపమే'. బిక్స్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ఇ.రాజమౌళి సమర్పణలో ఎ.ఎస్.పి. క్రియేటివ్‌ ఆర్ట్స్‌ పతాకంపై భాస్కర్‌ బాసాని

యంగ్ హీరో నందు, క్యూట్ గాళ్ తేజస్విని ప్రకాశ్ జంటగా తెరకెక్కుతున్న 'కన్నుల్లో నీ రూపమే'. బిక్స్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ఇ.రాజమౌళి సమర్పణలో ఎ.ఎస్.పి. క్రియేటివ్‌ ఆర్ట్స్‌ పతాకంపై భాస్కర్‌ బాసాని ఈ అందమైన ప్రేమకథా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాకేత్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవలే పలువురు సినీప్రముఖుల సమక్షంలో ప్రారంభోత్సవం జరుపుకున్న 'కన్నుల్లో నీ రూపమే' సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. యినాబాద్ పరిసర ప్రాంతాల్లో 12 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్‍‌లో సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.
 
'కన్నుల్లో నీ రూపమే' ఫేమ్ తేజస్విని ప్రకాశ్‌కి సైమా అవార్డ్ 
తాజాగా సైమా అవార్డ్స్ 2016కు బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ కేటగిరీలో హీరోయిన్ తేజస్విని ప్రకాశ్ ఎంపికవ్వడం విశేషం. కన్నడ హిట్ మూవీ 'గూలిహత్తి' సినిమాలో అద్భుతమైన నటనకనబర్చిన తేజస్వి ఈ అవార్డు గెలుచుకోవడం పట్ల చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేసింది. ఈ ఉత్సాహంతో తదుపరి షెడ్యూల్ ను పూర్తి చేసుకునేందుకు సిద్ధం అవుతోంది 'కన్నుల్లో నీ రూపమే' టీమ్.