Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నాకు పెళ్లి కాలేదు బాబోయ్ అంటూ మొత్తుకుంటున్న కుర్రహీరో... (Video)

మంగళవారం, 6 మార్చి 2018 (08:59 IST)

Widgets Magazine
Nithiin - Raashi khanna

యువ హీరో నితిన్‌కు హీరోయిన్ రాశి ఖన్నాతో వివాహం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా మీడియాకు రిలీజ్ చేశారు. దీంతో వార్తతో పాటు.. ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా సోషల్ మీడియా విపరీతంగా ట్రెండింగ్ అయింది. 
 
పెళ్లి దస్తుల్లో నితిన్ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో అందరూ అతను పెళ్లికొడుకాయెనే అంటూ ప్రచారం మొదలుపెట్టేశారు. ఈ వార్త ఆ నోట ఈ నోట నానుతూ చివరికి నితిన్ చెవికి చేరుకుంది. దాంతో పుకార్లకు ముగింపు పలకకుంటే లాభం లేదనుకున్న ఈ యూత్ హీరో 'అబ్బే నాకు ఇప్పుడే పెళ్లేంటి? అవన్నీ పుకార్లే' అంటూ ట్వీట్ చేశాడు. 
 
పెళ్లి దుస్తుల్లో ఉన్న తన ఫొటోలపై అతను క్లారిటీ ఇచ్చాడు. సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతున్న తన తదుపరి చిత్రం 'శ్రీనివాస కల్యాణం'కి సంబంధించినవని అతను చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో అతనికి జోడీగా అందాల ముద్దుగుమ్మ రాశి ఖన్నా నటిస్తోంది. ఆదివారం ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్‌కు సంబంధించిన ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు వివరణ ఇవ్వడంతో ఆయన ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. 
 
కాగా, ఇందులో రాశీ ఖన్నా, నందితా శ్వేత నాయికలు. ప్రకాష్ రాజ్ కీలక పాత్రధారి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఆదివారం ప్రారంభమైంది. ఈ చిత్రానికి మిక్కి జె.మేయర్‌ సంగీతాన్ని, సమీర్‌ రెడ్డి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. సతీశ్‌ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నారు. 

 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

తస్మాత్.. జాగ్రత్త అంటూ అల్లుడిని హెచ్చరించిన రజనీకాంత్... (Video)

సూపర్ స్టార్ రజనీకాంత్ తన అల్లుడు తమిళ యంగ్ హీరో ధనుష్‌ను హెచ్చరించారు. తస్మాత్ జాగ్రత్త ...

news

శ్రీదేవితో శిల్పాశెట్టి.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్..!

అతిలోక సుంద‌రి అంటే అభిమానం లేనిది ఎవ‌రికి. అంద‌రికీ శ్రీదేవి అంటే అభిమాన‌మే. టాలీవుడ్, ...

news

''కాలా'' టీజర్ అదుర్స్.. రెండు కోట్లను మించిన వీక్షకులు..

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ''కాలా'' సినిమా టీజర్ నెట్టింట వైరల్ అవుతోంది. కబాలి ...

news

''రంగా రంగ స్థలాన'' పాటకు వ్యూస్ వెల్లువ.. (వీడియో)

రంగస్థలం పాటలు నెట్టింట దుమ్మురేపుతున్నాయి. దేవీశ్రీ ప్రసాద్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ...

Widgets Magazine