ఉమర్ సంధు ట్వీట్‌లో నిజంలేదు.. హీరో ప్రభాస్ ప్రతినిధులు

బుధవారం, 4 అక్టోబరు 2017 (15:44 IST)

prabhas-anushka

హీరో ప్రభాస్, హీరోయిన్ అనుష్కలు ప్రేమలో మునిగిపోయివున్నారనీ, వచ్చే డిసెంబరు నెలలో వీరిద్దరికీ ఎంగేజ్‌మెంట్ జరుగబోతుందంటూ బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ ఉమర్ సంధు చేసిన వార్తలను ప్రభాస్ ప్రతినిధులు కొట్టిపారేస్తున్నారు. ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చి చెప్పారు. 
 
ప్రభాస్, అనుష్కలు త్వరలో ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్నారంటూ ఉమైర్ సంధు తన ట్విట్టర్ ఖాతాలో మంగళవారం వరుసగా రెండు పోస్ట్‌లో పోస్ట్ చేశాడు. తన ట్వీట్టర్ పేజ్‌లో బ్రేకింగ్ న్యూస్ అంటూ ప్రభాస్, అనుష్కల ప్రేమ వ్యవహారం గురించి ట్వీట్ చేశారు. ప్రభాస్, అనుష్కల క్లోజ్ ఫ్రెండ్ తనకి చెప్పినట్లుగా ఉమైర్ సంధు ఈ విషయాన్ని వెల్లడించారు.
 
అంతేకాదు వారిద్దరికీ.. ఒకరంటే మరొకరికి ఎంతో ప్రేమ ఉందని, ఒకరి పట్ల మరొకరు చాలా కేర్ తీసుకుంటారని, వారిద్దరి మధ్య రిలేషన్‌షిప్ నడుస్తోందని తన స్నేహితుడు తనికి చెప్పినట్లుగా అందులో పేర్కొన్నాడు. ఈ వార్త తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారమే లేపింది. 
 
దీంతో హీరో ప్రభాస్ తరపున ఆయన ప్రతినిధులు స్పందించారు. ఇది తప్పుడు ప్రచారమని స్పష్టం చేశారు. నిజంగా ప్రభాస్-అనుష్కల మధ్య ప్రేమ ఉంటే.. దాన్ని వారే స్వయంగా ప్రకటిస్తారని.. సంబంధం లేని వారు అది కూడా సోషల్ మీడియాలో ప్రకటించరని తెలిపారు.దీనిపై మరింత చదవండి :  
Prabhas Rumours Marriage Tweet Umari Sandhu Anushka Shetty

Loading comments ...

తెలుగు సినిమా

news

హవ్వా.. అనసూయ అలా చేసేందుకు సిద్ధమైంది...

అనసూయ. బుల్లితెరపై హాట్ యాంకర్. నాగార్జునతో కలిసి జతకట్టిన తరువాత అనసూయకు అవకాశాలు మీద ...

news

ప్రేమ... ఒకడి చేతిలో దెబ్బతిన్నా... మరొకడికి టైం ఇవ్వలేకపోయా... కాజల్

కాజల్ అగర్వాల్ తన చెల్లెల్లి పెళ్లి చేస్కున్నప్పటికీ ఆమె మాత్రం ఇంకా పెళ్లి గురించి ...

news

మీసాలు తీసేసింది గర్ల్స్ లైక్ చేస్తారనేనట... నాగార్జున కామెంట్

మరో రెండు రోజుల్లో మామయ్య కాబోతున్న అక్కినేని నాగార్జున ఈమధ్య మీసాలు తీసేసి ...

news

సమంత - చైతూ పెళ్లి బడ్జెట్ ఎంతంటే?

టాలీవుడ్ హీరో నాగ చైతన్య, హీరోయిన్ సమంతలు ఓ ఇంటివారు కాబోతున్నారు. ఈనెల 6, 7 తేదీల్లో ...