బిగ్ బాస్ ''ప్రిన్స్'' ఇలా మారిపోయాడేంటి?

సినీ హీరో అయినప్పటికీ బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రిన్స్.. కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. బిగ్ బాస్ తొలి సీజన్‌ పార్టిసిపెంట్ అయిన ఇతను ప్రస్తు

selvi| Last Updated: గురువారం, 9 ఆగస్టు 2018 (13:08 IST)
సినీ హీరో అయినప్పటికీ బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రిన్స్.. కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు  రానున్నాడు. బిగ్ బాస్ తొలి సీజన్‌ పార్టిసిపెంట్ అయిన ఇతను ప్రస్తుతం గ్రాండ్ రీ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకున్నాడు. కొత్తదనం నిండిన కథతో మరో ప్రేమకథా చిత్రమ్‌లో ప్రిన్స్ నటించబోతున్నాడు. 
 
ఈ సినిమా కోసం తన బాడీ స్టైల్ మార్చుకున్నాడు. ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. మరో కీలక పాత్రలో ఓ స్టార్ హీరోయిన్ కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఎ. సుశాంత్ రెడ్డి మరోసారి తానే నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది. గతంలో సూపర్ స్టార్ కిడ్నాప్ అనే కామెడీ థ్రిల్లర్‌ని రూపొందించిన దర్శకుడు సుశాంత్ రెడ్డి రూపొందిస్తున్న మూవీ కోసం ప్రిన్స్ సిక్స్ ప్యాక్‌తో కండలు పెంచి చాలా కొత్తగా కనిపిస్తున్నాడు.
 
విభిన్నమైన బ్యాక్ డ్రాప్‌లో లవ్ స్టోరీగా రూపొందనున్న ఈ సినిమా కోసం ప్రిన్స్ చేసిన ఫోటో షూట్ వైరల్‌గా మారింది. లఢక్, గోవా, హైదరాబాద్, వారణాసి లాంటి డిఫరెంట్ లొకేషన్స్‌లో ఈ సినిమా షూటింగ్‌ను ప్లాన్ చేశారు. బస్ స్టాప్ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ లేక వెయిట్ చేస్తున్న ప్రిన్స్‌కు ఈ సినిమాతో బంపర్ హిట్ ఖాయమని అప్పుడే సినీ పండితులు జోస్యం చెప్పేస్తున్నారు.దీనిపై మరింత చదవండి :