శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 21 ఏప్రియల్ 2018 (11:24 IST)

టాలీవుడ్ యువ హీరో తండ్రికి మూడేళ్ళ జైలు.. ఎందుకంటే?

తెలుగు చిత్ర పరిశ్రమలో మినిమమ్ గ్యారెంటీ హీరోగా గుర్తింపు పొందిన యువ హీరోల్లో రాజ్ తరుణ్ ఒకరు. ఈయన తండ్రికి నకిలీ బంగారు కుదువపెట్టిన కేసులో కోర్టు మూడేళ్ళ జైలుశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ

తెలుగు చిత్ర పరిశ్రమలో మినిమమ్ గ్యారెంటీ హీరోగా గుర్తింపు పొందిన యువ హీరోల్లో రాజ్ తరుణ్ ఒకరు. ఈయన తండ్రికి నకిలీ బంగారు కుదువపెట్టిన కేసులో కోర్టు మూడేళ్ళ జైలుశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే..
 
రాజ్ తరుణ్ తండ్రి బసవరాజు విశాఖపట్నంలోని వేపగుంటలో నివసిస్తుంటారు. ఆయన సింహాచలం ఎస్‌బీఐ బ్రాంచిలో 2013లో స్పెషల్ అసిస్టెంట్ క్యాషియర్‌గా పనిచేసే సమయంలో తన భార్య రాజ్యలక్ష్మితో పాటు అదే ప్రాంతానికి చెందిన ఎంఎస్ఎన్ రాజు, ఎన్. సన్యాసిరాజు, కె.సాంబమూర్తి, ఎన్.వెంకట్రావు పేర్ల మీద నకిలీ బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.9.85లక్షల రుణం తీసుకున్నారు. 
 
ఆ తర్వాత బ్యాంకు ఆడిటింగ్‌లో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ఈ విషయంపై బ్యాంకు మేనేజర్ సుబ్రహ్మణ్యం ఫిర్యాదు మేరకు గోపాలపట్నం పోలీసులు విచారణ చేపట్టారు. అనంతరం సీఐ నరసింహారావు దీనిపై ఓ నివేదికను కోర్టుకు అందజేశారు. ఈ నివేదికను పరిశీలించిన కోర్టు బసవరాజుకు జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.