Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

"ఎస్‌4"కు ఐదేళ్ళు పడుతుంది.. హీరో సూర్య

మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (20:14 IST)

Widgets Magazine
surya

సింగం సిరీస్‌లో మూడు భాగాలు చేసి హ్యాట్రిక్‌ సాధించాను. నాలుగో భాగాన్ని ఎప్పుడు చేస్తారని అడుగుతున్నారు. అందుకు ఐదేళ్ళు పడుతుందని హీరో సూర్య అంటున్నాడు. "సి‌3".. తమిళ సినిమా సినిమా 'సింగం3'గా తెలుగులో విడుదలై విశేష ఆదరణ పొందుతోంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌ విచ్చేసిన సూర్య పలు విషయాలను తెలియజేశారు. 
 
నా కెరీర్‌లో ఎంతో ప్రధాన్యం వహించిన చిత్రమిది. పండుగ సీజన్‌లో విడుదలకాకపోయినా ఇంత పెద్ద ఎత్తున ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారంటే అంతకంటే ఆనందం ఇంకేమీ లేదు. ఇటు తెలుగునాటే కాదు అటు తమిళనాడు కూడా మంచి కలెక్షన్లతో చిత్రం దూసుకుపోతోంది. నిర్మాతలతోపాటు చిత్రాన్ని తీసుకున్న డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఎంతో ఆనందంగా ఉన్నారు. అలాగే సినిమాను చూసిన ప్రేక్షకులు క్రిటిక్స్‌ కూడా పాజిటివ్‌గా స్పందించారు. 
 
నీతి నిజాయితీలతో పనిచేస్తున్న పోలీసులను స్ఫూర్తిగా తీసుకుని రూపొందించిన చిత్రమిది. అందుకే పోలీసులు కూడా ఈ చిత్రాన్ని తమదిగా భావిస్తున్నారు. ఇప్పటికి హ్యాట్రిక్‌ సాధించాను. పాత్ర పరంగా ఎక్కడ ఎంత టెంపో ఉండాలో అక్కడ అంత టెంపోను పెట్టి దర్శకుడు హరి ఈ విజయంలో కీలక పాత్ర వహించారు. పాత్రకు అనుగుణంగా వెజిటేరియన్‌ను మాత్రమే తిన్నాను. 
 
అందుకు దర్శకుడు ఇచ్చిన శిక్షణ మర్చిపోలేనిది. చిత్రం చూశాక నాన్నగారు నన్ను హత్తుకుని.. మంచి సినిమా తీశాని మెచ్చుకోవడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి. తెలుగులో శివకుమార్‌ లాంటి నిర్మాత చక్కటి పబ్లిసిటీతో అందరికి చేరువయ్యేలా చేశారని తెలిపారు. తదుపరి చిత్రాల గురించి చెబుతూ.. విఘ్నేష్‌శివన్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నానని తెలిపారు. 
 
దర్శకుడు హరి మాట్లాడుతూ ఈ చిత్రానికి కొనసాగింపుగా ఎస్‌-4 చిత్రం తీసే ఆలోచన ఉన్నప్పటికీ ఐదేళ్ళ తర్వాత మాత్రమే సాధ్యమవుతుంది. ఈలోగా సూర్య, నా కాంబినేషన్‌లో వేరొక చిత్రం వుంది. ప్రస్తుతం నేను 'సామి-2' చిత్రం చేయబోతున్నాను' అని చెప్పారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

"కథలో రాజకుమారి" కోసం రఫ్ లుక్‌తో రోహిత్

వైవిధ్యమైన కథలను ఎంచుకొంటూ యువ కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్న ...

news

'ఘాజీ' యూట్యూబ్ సినిమా.. అనుకోకుండా వెండితెరపై ఆవిష్కరించాం : సంకల్ప్ రెడ్డి

దర్శకునిగా తొలి చిత్రాన్ని ప్రేమకథతో కాకుండా యుద్ధ నేపథ్యంలోసాగే కథతో ముందుకు వచ్చిన ...

news

ఎన్టీఆర్ సినిమాలో ముగ్గురు భామలు.. రాశిఖన్నా ఓకే.. కాజల్-తమన్నాలను కూడా సెలెక్ట్ చేశారా?

బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న సినిమా ఇటీవలే ప్రారంభమైంది. ఈ సినిమా ...

news

రకుల్ ప్రీత్ సింగ్ "పరేశానురా సాంగ్‌"కు యూట్యూబ్‌లో మంచి క్రేజ్.. ఆకట్టుకున్న స్కిన్ షో..

టాలీవుడ్ అందాల సుందరి రకుల్ ప్రీత్ సింగ్‌కు సూపర్ ఫాలోయింగ్ ఉందనే విషయం గురించి ...

Widgets Magazine