శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: మంగళవారం, 24 మే 2016 (20:21 IST)

విక్రమ్‌ ఏమయ్యాడు?

విక్రమ్‌ సినిమాలంటే అపరిచితుడు నుంచి ఐ వరకు అన్నీ భిన్నమైనవే. అయితే 'ఐ' ప్రయోగం వికటించడంతో తను భిన్నమైన పాత్రలు వేయడానికి వెనుకంజ వేయకపోయినా.. ఆయనతో ప్రయోగాలు చేయడానికి జంకుతున్నారు దర్శక నిర్మాతలు. దీనికి కారణం సూర్యనే అని తమిళవర్గాలు తెలియజేస్తున్

విక్రమ్‌ సినిమాలంటే అపరిచితుడు నుంచి ఐ వరకు అన్నీ భిన్నమైనవే. అయితే 'ఐ' ప్రయోగం వికటించడంతో తను భిన్నమైన పాత్రలు వేయడానికి వెనుకంజ వేయకపోయినా.. ఆయనతో ప్రయోగాలు చేయడానికి జంకుతున్నారు దర్శక నిర్మాతలు. దీనికి కారణం సూర్యనే అని తమిళవర్గాలు తెలియజేస్తున్నాయి. కొత్త కొత్తగాప్రయోగాలు చేస్తూ... గజనీ నుంచి 24... సినిమాల వరకు చేసిన భిన్నపాత్రలతో ఇప్పటి ప్రేక్షకుల్ని మరిపిస్తున్నాడు. 
 
దాంతో విక్రమ్‌ గురించి ఆలోచించేవారు లేరు. తెలుగువాడైనా.. తమిళంలో మంచి ఫామ్‌లో వున్న విక్రమ్‌.. ఈసారి వెనకడువేశాడు. తనకు తమిళంలో కూడా నటిస్తున్న చిత్రాలు పెద్దగా లేవు. ఏవైనా భిన్నమైన పాత్రలుంటే.. సూర్య, విశాల్‌లు చేసేస్తున్నారు. ఇటీవలే విశాల్‌ కూడా కొత్తగా ప్రయోగాలు చేయడంలో తాను ముందుంటానని ప్రకటించాడు. అయితే త్వరలో శంకర్‌ వంటి దర్శకులు ముందుక వచ్చి మరలా విక్రమ్‌తో సినిమా చేస్తేనే వెలుగులోకి వస్తాడని కోలీవుడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.