Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నువ్వు మనిషివేనంట్రా మూర్ఖుడా..ఇలియానా ఎంత మాటనేసింది?

హైదరాబాద్, శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (03:40 IST)

Widgets Magazine

బాధితులపట్ల సానుభూతి చూపిస్తూ షేర్ చేస్తున్న స్పందనలపై కూడా వికృత వ్యాఖ్యలు చేసే దున్నపోతులు మగాళ్ల రూపంలో మనలో ఉన్నప్పుడు ఎంత హీరోయిన్లైనా ఆగ్రహించకుండా ఉంటారా. ఇలాంటి దుర్వ్యాఖ్యల బారినపడిన నిన్నటి టాలీవుడ్ టాప్ హీరోయిన్ ఇలియానా ఒక్కశివాలెత్తిపోయింది. ప్రియుడి చేతిలో మోసపోయిన యువతి బాధను పంచుకుంటూ ట్వీట్ చేస్తే దానిపై కూడా లైంగికపరమైన నీచ వ్యాఖ్య చేసిన ఆ మగాడిని పట్టుకుని దులిపేసింది. మనిషివా ...వ్వా అనే రేంజిలో ఊగిపోయింది. 
 
సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు బాగా వ్యాప్తిలోకి వచ్చిన పదం ట్రోల్ అంటే వ్యక్తిగతంగా కించపరిచే దూషణలు అని అర్థం. వీటి బారిన పడటం సినీ హీరోయిన్లకు, సెలబ్రిటీలకు కొత్త కాదు కాని పుణ్యం కోసం పోతే పాపమెదురైనట్లు ఒకప్పటి టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌, ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉన్న ఇలియానాకు తాజాగా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. తాజాగా ట్విట్టర్‌లో ఓ కథనాన్ని ఆమె షేర్‌ చేసుకుంది. 
 
తనకు పంపిన మెసేజ్‌లు, నగ్న ఫొటోలు బయటపెడతానని ఓ అమ్మాయికి ఆమె మాజీ ప్రియుడు చేసిన బెదిరింపులను ఆమె ధైర్యంగా ఈ కథనంలో బట్టబయలుచేసింది. ఈ హేయమైన పనిచేసిన వాడిని బహిర్గతం చేసి.. ఆ అమ్మాయి గొప్ప పని చేసిందని, ఆమెను చూస్తే గర్వంగా ఉందని ఇలియానా ట్వీట్‌ చేసింది. తాను కూడా ఈవ్‌ టీజింగ్‌, వేధింపుల బాధితురాలినేనని, ఇది ఎంతో మానసిక క్షోభ కలిగిస్తుందని ఆమె తన అనుభవాన్ని గుర్తుచేసుకుంది. తనకు ఎంతోమంచి తల్లిదండ్రులు ఉన్నారని, వారు తనకు ఎంతో భరోసాను ఇచ్చారని పేర్కొంది. 
 
నిజానికి ఇక్కడితో ఈ అంశం ముగిసిపోవాలి. అయితే, ఇక్కడి నుంచే కొందరు నెటిజన్లు వెకిలి చేష్టలకు ప్రయత్నించారు. ఇంత అర్ధరాత్రి ఈ విషయం ఎందుకు గుర్తుకువచ్చిందని ఓ నెటిజన్‌ అడుగగా.. తాను ఇప్పుడు ఆ కథనాన్ని కాజువల్‌గా చదివానని, షేర్‌ చేసుకుంటే బాగుంటుందని అనిపించిందని ఇలియానా బదులిచ్చింది. ఇంతలో మరో నెటిజన్‌ కామెంట్‌ చేస్తూ.. లైంగికపరమైన నీచమైన కామెంట్‌ చేశాడు. అతని కామెంట్‌తో ఆగ్రహించిన ఇలియానా.. ఎంతటి మూర్ఖుడివి నువ్వు అంటూ ఘాటుగా బదులిచ్చింది.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
ఇలియానా ట్విట్టర్‌ ట్రోల్‌ హీరోయిన్ బాలివుడ్ టాలివుడ్ ప్రియుడు నగ్నఫొటోలు బెదిరింపు ట్వీట్ ఈవ్ టీజింగ్ బాధితురాలు Ileana Twitter Troll

Loading comments ...

తెలుగు సినిమా

news

అమిత్‌షాను వణికిస్తున్న.. మోదీని సమ్మోహితుడిని చేస్తున్న అభినవ బాహుబలి

బాహుబలి తొలి భాగాన్ని చూసిన వారు జీవితంలో మర్చిపోలేని పాట ‘ఎవ్వరంట.. ఎవ్వరంట నిన్ను ...

news

హాథీరాం బాబాగా నటించిన నాగార్జున చరిత్రలో నిలిచిపోతారు: నిర్మాత ఎ. మహేష్‌ రెడ్డి

వ్యాపార రంగంలో అంచెలంచెలగా ఎదిగి ఎ.ఎం.ఆర్‌. గ్రూప్‌ సంస్థను స్థాపించి నాలుగు వేల మందికి ...

news

సుబ్బిరామిరెడ్డి చిత్రంలో చిరు-పవర్ స్టార్, చిరుతో అనుష్క-పవన్‌తో శ్రుతి, డైరెక్టర్ ఎవరంటే?

టి.సుబ్బిరామిరెడ్డి తను చిరంజీవి-పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో చిత్రాన్ని నిర్మిస్తానని ఖైదీ ...

news

చిరంజీవి - పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్ ఫిల్మ్ ‌.. మాటల మాంత్రికుడి దర్శకత్వంలో...

మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో మల్టీస్టారర్ చిత్రం నిర్మితంకానుంది. ఈ ...

Widgets Magazine