Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నీ జత లేకా.. పిచ్చిది కాదా మనసంతా... బాహుబలికి మళ్లీ చేరువైన దేవసేన

హైదరాబాద్, శుక్రవారం, 7 జులై 2017 (02:42 IST)

Widgets Magazine

మెచ్చేనులే దేవసేనా... బాహుబలి 2లో మెరుపులో మెరిసిన హంస పాటలో పల్లవిలో భాగం ఇది. దేవసేన మెచ్చిందో మెచ్చలేదో కానీ అఖిల భారత ప్రేక్షకులు, ప్రపంచ సినీ జీవులు సైతం ఆ జంటను హిట్ పెయిర్‌గా క్యూటెస్ట్ జంటగా ఏకగ్రీవంగా ఒప్పేసుకున్నాయి. రెండు నెలలుగా ప్రభాస్, మధ్య కెమిస్ట్రీ గురించి, వారి వ్యక్తిగత జీవితం గురించి భారతీయ చిత్రపరిశ్రమ కోడై కోస్తూనే ఉంది. ఎందుకు వారంటే అంత పిచ్చి అభిమానం అంటే వారు నటించిన పాత్రలు అలాంటివి. అమరేంద్ర బాహుబలి, దేవసేన.. కోట్లాది ప్రేక్షకులను దాసోహుల్ని చేసిన అతిగొప్ప పాత్రలు. భారతీయ ప్రజానీకం వారిద్దరినీ చూసి ఫిదా అయిందంటే ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు.
prabhas-anushka
 
బాహుబలి-2లో అమరేంద్ర బాహుబలి, దేవసేనల జంటను మనదేశమే కాదు ప్రపంచదేశాల ప్రేక్షకులు తెగ మెచ్చేశారు. అంతగా బహుళ ప్రాచుర్యం పొందిన ప్రభాస్, అనుష్కల జంట అంతకు ముందే బిల్లా, మిర్చి, బాహుబలి చిత్రాల్లో నటించి హిట్‌ పెయిర్‌గా నిలిచారు. బాహుబలి-2తో ఈ జంట మళ్లీ కలిసి నటిస్తే బాగుండు అన్నంతగా పేరు తెచ్చుకున్నారు. బాహుబలి-2 చిత్రం తరువాత ప్రభాస్‌ సాహో అనే త్రిభాషా(తమిళం, తెలుగు, హిందీ) చిత్రంలో నటిస్తున్నారు. ఈ భారీ చిత్రంలోనూ ఆయనకు జంటగా అనుష్క నటిస్తే బాగుంటుందని భావించిన వారు లేకపోలేదు.
 
అయితే సుజిత్‌ దర్శకత్వం వహిస్తున్న సాహో చిత్రంలో వేరే హీరోయిన్‌ కోసం అన్వేషణ జరుగుతోందన్న ప్రచారం జోరందుకుంది. బాలీవుడ్‌ బ్యూటీస్‌ సోనంకపూర్, అలియాభట్, పూజాహెగ్డేలతో చర్చలు జరుగుతున్నాయనే వార్తలు వెలువడ్డాయి.దీంతో ఈ చిత్రంలో అనుష్కకు అవకాశం లేదేమో అనుకున్న వారికి శుభవార్త సాహో చిత్రంలో అనుష్కనే హీరోయిన్‌​అన్నది. దీనికి సంబంధించిన అధికారకపూర్వ ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉందని తెలిసింది. మొత్తం మీద ప్రభాస్, అనుష్క ఐదోసారి జత కట్టనున్నారన్నమాట. మరి ఈ జంట మళ్లీ మ్యాజిక్‌ రిపీట్‌ అవుతుందా అన్నది వేసి చూడాలి.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
అనుష్క సాహో ప్రభాస్‌ Prabhas Sahoo Heroine Anushka

Loading comments ...

తెలుగు సినిమా

news

జై లవకుశ... కనీసం ఒక్క విషయంలోనైనా బాహుబలిని బీట్ చేస్తుందా?(వీడియో)

సహజమే. ఇప్పుడు ఏ చిత్రం విడుదలవుతున్నా బాహుబలి లెక్కల్లోకి తొంగి చూస్తున్నారు. తాజాగా ...

news

'తలైవా' రజినీకాంత్ జీవితంలో తొలి సెల్ఫీ... రికార్డువుతుందా అంటూ మెట్టమాస్‌లా...(వీడియో)

రజినీకాంత్. ఈ పేరు చెబితే దక్షిణాది సినీ అభిమానులు ఊగిపోతారు. సినిమాల్లో ఆయన చేసే ...

news

సముద్రమంత ద...ధైర్యం వుండాల... ఎన్టీఆర్ నత్తి, జై లవకుశ టీజర్(వీడియో)

జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం జై లవకుశ చిత్రం టీజర్ రిలీజ్ అయ్యింది. యంగ్ టైగర్ విలనిజమ్ ...

news

కట్లు తెంచుకున్న 'కంచె' భామ... బికినీలో రెచ్చిపోయింది... (Photos)

'కంచె' సినిమాలో పాత కాలపు క్యారెక్టర్లో మెప్పించిన ప్రగ్యా, లవ్ స్టోరీలతో పాటు 'ఓం ...

Widgets Magazine