శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : బుధవారం, 1 జులై 2015 (13:13 IST)

శంకర్ సినిమాలో హాలీవుడ్ హీరో... జోరుగా రోబో-2 స్క్రిప్ట్ వర్క్..

బ్రహ్మాండాల రూపకర్త శంకర్ దర్శకత్వంలో దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం రోబో-2. ఈ చిత్రంలో హాలీవుడ్ యాక్షన్ హీరో అర్నాల్డ్ ష్వార్జ్ నెగర్ నటించనున్నాడనే వార్తలు కోలీవుడ్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయం అక్కడ హాట్ టాపిక్‌గా మారింది. గతంలో శంకర్, రజనీకాంత్‌ల కాంబినేషన్‌లో విడుదలై సూపర్ హిట్ కొట్టిన చిత్రం రోబో.
 
వీరి కాంబినేషన్‌లోనే రోబో సీక్వెల్‌ కూడా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర స్క్రిప్ట్ వర్క్ జోరుగా జరుగుతోంది. ఈ పనుల్లో శంకర్ బిజీగా ఉన్నాయి. ఈ సినిమా వివరాలను శంకర్ అత్యంత సీక్రెట్‌గా ఉంచుతున్నాడు. తాజా సమాచారం ఏంటంటే ఈ చిత్రంలో హాలీవుడ్ హీరో అర్నాల్డ్ కూడా నటించనున్నారట. ఆ మధ్య శంకర్ దర్శకత్వంలో విడుదలైన 'ఐ' మూవీ ఆడియో వేడుకకు అర్నాల్డ్ హాజరైన విషయం తెలిసిందే.
 
అప్పుడు శంకర్ దర్శకత్వంలో నటించాలనే కోరికను అర్నాల్డ్ వెలిబుచ్చారట. దీంతో రోబో-2లో అర్నాల్డ్ కోసం ఒక పాత్రను శంకర్ తీర్చిదిద్దుతున్నారని సమాచారం. అయితే ఈ విషయం అధికారికంగా తెలియాల్సి ఉంది. ఈ చిత్రంలో అర్నాల్డ్ నటిస్తే రోబో-2కు అంతర్జాతీయ స్థాయిలో పబ్లిసిటీ వస్తుందని సినీ వర్గాల టాక్.