బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 2 సెప్టెంబరు 2015 (12:53 IST)

సోనమ్ కపూర్‌కు అంత పవరుందట.. కంగనా గురించి..హృతిక్ ఏమన్నాడు?

సోనమ్ కపూర్‌పై బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ప్రశంసల జల్లు కురిపించాడు. దర్శకుడు అహ్మద్ ఖాన్ రూపొందించిన దీరే దీరే.. పాటను ముంబైలో విడుదల చేసిన సందర్భంగా హృతిక్ రోషన్ మాట్లాడుతూ.. సోనమ్ కపూర్ నవ్వుకు 100 వాట్ల వెలుగుంది. తను చాలా ఎనర్జిటిక్.. అంతేకాకుండా తెలివైన వ్యక్తి కూడా అని హృతిక్ కితాబిచ్చాడు. 
 
ప్రేమ అంశంతో ముడిపడిన ఈ పాటను మీరెవరికి అంకితమిస్తారు? అని ఈ విలేకరులు ప్రశ్నించగా, తన జీవితంలో అలాంటి వారు ఎవ్వరూ లేరని చెప్పాడు. అదే సమయంలో సోనమ్ గురించి మాట్లాడుతూ, ఈ పాట చాల్ హాట్‌గా ఉంటుందని, సోనమ్ కూడా అంతే హాట్‌గా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ఆమెతో కలసి పనిచేయడం ఇది రెండోసారి అని చెప్పాడు. 
 
అయితే నటి కంగనా రనౌత్ తో మీ రొమాన్స్, రిలేషన్ గురించి చెప్పండని మళ్లీ మీడియా అడగడంతో ఒక్కసారిగా షాకైన హృతిక్ షాక్ అయ్యాడు. ఆ ప్రశ్న గురించి ఏం చెప్పగలమని ఎస్కేప్ అయ్యాడు.