శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , ఆదివారం, 5 మార్చి 2017 (05:16 IST)

అమ్మాయిలు అంతబాగా లెటర్స్ ఎలా రాస్తారు.. భలేగా ఉంటాయి: ప్రభాస్ మైమరపు

బాహుబలి అంటే అభిమానులకు ఇష్టం. అభిమానులంటే బాహుబలి మరీ ఇష్టం. అందులోనూ అమ్మాయలు రాసే ఉత్తరాలంటే మరీ మరీ మరీ ఇష్టం. అంత బాగా ఎలా రాస్తారు అని బాహుబలి ఆశ్చర్యపడిపోయేంతగా ఉంటాయట అవి. అమ్మాయిలు రాసి పంపిన కొన్ని లవ్ లెటర్లు చదువుతూంటే భలే అనిపిస్తుంటుంద

బాహుబలి అంటే అభిమానులకు ఇష్టం. అభిమానులంటే బాహుబలి మరీ ఇష్టం.  అందులోనూ అమ్మాయలు రాసే ఉత్తరాలంటే మరీ మరీ మరీ ఇష్టం. అంత బాగా ఎలా రాస్తారు అని బాహుబలి ఆశ్చర్యపడిపోయేంతగా ఉంటాయట అవి. అమ్మాయిలు రాసి పంపిన కొన్ని లవ్ లెటర్లు చదువుతూంటే భలే అనిపిస్తుంటుందట. భారతీయ చలనచిత్ర పరిశ్రమను విశ్వ యవనికపై శిఖరస్థాయిలో నిలిపిన బాహుబలికి అతడు కథానాయకుడు. నాలుగేళ్లు ఒకే సినిమాకు కాల్ షీట్లు ఇచ్చి పక్కకు పోకుండా షూటింగ్ స్థలాన్నే తన నివాసంగా మార్చుకున్న అంకితభావానికి నిలువెత్తు నికేతనం అతడు. సినిమాల్లో భారీతనానికి అర్థం మార్చేసిన మహాకాడయుడతడు. అంతటి బాహుబలికి కూడా నిజజీవితంలో చిన్న చిన్న విషయాలంటే ఎంత సంతోషమో. ఎంత ఆసక్తో.. తన మాటల్లోనే విందాం.

 
అమ్మాయిలనుంచి లెటర్లు రావడం ఒక లక్‌. హీరో అయినప్పుడు ఎక్కువమందికి నచ్చితే చాలనుకునేవాణ్ణి. లక్కీగా అమ్మాయిలకు కూడా నచ్చేశాను. మేబీ ‘వర్షం’లాంటి లవ్‌స్టోరీ చేయడం వల్ల ఎక్కువమంది ఇష్టపడుతున్నారేమో. నిజానికి ‘మిర్చి’ తర్వాత అమ్మాయిలు పంపే లవ్‌ లెటర్స్‌ పెరిగాయి. ‘బాహుబలి’ తర్వాత ఇంకా పెరిగాయి. అల్‌మోస్ట్‌ అన్నీ చదువుతాను. ఇప్పటికిప్పుడు అంటే చెప్పలేను కానీ, కొన్ని లవ్‌ లెటర్స్‌ చదివినప్పుడు భలే అనిపిస్తుంటుంది. అసలంత బాగా ఎలా రాస్తారా అనుకుంటుంటాను.
     
కవితలు రాయడం. చదవడం.. అబ్బే అంత సీన్‌ లేదు. అమ్మాయికి ప్రపోజ్‌ చేయాలనుకుంటే డైరెక్ట్‌గా గ్రీటింగ్‌ కార్డ్స్‌ షాప్‌కి వెళ్లేవాణ్ణి. రెండు కలర్‌ఫుల్‌ కార్డ్స్, అందులో మాంచి కొటేషన్‌ ఉందేమో చూసుకునేవాణ్ణి. అది కొని, ఇచ్చేవాణ్ణి. చిన్నప్పుడు అది లవ్వో, ఎట్రాక్షనో తెలియక అలా ఇచ్చేవాణ్ణి. లెక్కలడిగితే చెప్పలేను. నాకు ప్రపోజ్ చేసే అమ్మాయిల విషయంలో మా అమ్మగారికి అంత టెన్షన్‌ లేదు. చాలా విషయాల్లో ఆవిడ బ్రాడ్‌గా ఆలోచిస్తుంది. అమ్మ పెరిగిన వాతావరణం డిఫరెంట్‌. లైఫ్‌లో చాలా నేర్చుకుంది.
 
మా నాన్నగారు ‘బాహుబలి’ చూడలేదనే బాధ తప్పకుండా ఉంటుంది...రాఘవేంద్రరావుగారు, మా బంధువులు కూడా ఈ మాట చాలాసార్లు అన్నారు. నాన్నగారు ‘బాహుబలి’ చూడలేదనే కొరత నాకూ చాలా ఉంది. ఆయన ఉండుంటే ఎంతో ఆనందపడేవారు. ‘బాహుబలి’తో నాకొచ్చిన పాపులార్టీకి మా అమ్మ ఎంతో సంతోషపడింది. ఇతర దేశాలకు కూడా వెళ్లింది కదా. ఈ సినిమా అప్పుడు చాలా హ్యాపీ మూమెంట్స్‌ ఉన్నాయి. ఇలాంటి ఓ సినిమా చేయడమే ఓ హ్యాపీ మూమెంట్‌. ఇతర స్టేట్స్‌కి వెళ్లినప్పుడు, వేరే కంట్రీస్‌లోనూ అందరూ ఆత్మీయంగా మాట్లాడటం... అవన్నీ వెరీ స్పెషల్‌.
 
బ్యాంకాక్‌లోని మేడమ్‌ తుస్సాడ్స్‌లో నా మైనపు బొమ్మ పెట్టబోవడం గమ్మత్తుగా ఉంది. ఇంకా బొమ్మ రెడీ కాలేదు. వాళ్లు వచ్చి ఫేస్‌ కొలతలవీ తీసుకువెళ్లారు. కళ్లు ఎలా ఉంటాయి ముక్కు, బుగ్గలు... ఇలా అన్నీ ఫొటోలు తీశారు. నావి త్రీడీ పిక్చర్స్‌ తీశారు. మొత్తం మూడు నాలుగు గంటలు పట్టింది. భలే గమ్మత్తుగా అనిపించింది. ‘బాహుబలి’ తాలూకు మరో స్వీట్‌ మెమరీ ఇది.
 
స్వీట్‌గా మాట్లాడుతుంటానని చాలా మంది అంటుంటారు.. నిజానికి  స్వీట్‌ అంటే నాకు చాక్లెట్సే. విపరీతంగా తింటాను. ఐస్‌క్రీమ్‌ తిన్నా చాక్లెట్‌ ఫ్లేవరే అయ్యుండాలి. రస్‌మలై కూడా ఇష్టమే.