గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 26 మే 2017 (05:31 IST)

భారతీయులకు ఈ క్రియేటివిటీ ఎలా సాధ్యం? బాహుబలి-2 గ్రాఫిక్స్‌తో నివ్వెరపోయిన హాలీవుడ్ స్టార్ హీరో

భారతీయ దర్శకులు బాహుబలి 2 వంటి గొప్ప సృజనాత్మక సినిమాలు అంత రిచ్‌గా ఎలా తీయగలుగుతున్నారంటూ హాలీవుడ్ సూపర్ స్టార్ విన్ డీజె్ల్ ప్రశంసల వర్షం కురిపించారు. ట్రిపుల్ ఎక్స్ రిటర్న్ సినిమా ప్రమోషన్ కార్యక్రమం కోసం దీపికా పడుకునేతో కలిసి ఇటీవలే ముంబై వచ్చిన

భారతీయ దర్శకులు బాహుబలి 2 వంటి గొప్ప సృజనాత్మక సినిమాలు అంత రిచ్‌గా ఎలా తీయగలుగుతున్నారంటూ హాలీవుడ్ సూపర్ స్టార్ విన్ డీజె్ల్ ప్రశంసల వర్షం కురిపించారు. ట్రిపుల్ ఎక్స్ రిటర్న్ సినిమా ప్రమోషన్ కార్యక్రమం కోసం దీపికా పడుకునేతో కలిసి ఇటీవలే ముంబై వచ్చిన విన్ డీజెల్ బాహుబలి 2 ప్రీమియర్ షో చూశారు. చూసిన తర్వాత "చిత్రం అదిరిపోయింది" అంటూ ఒక్కమాటతో బాహుబలి 2ని ఆకాశానికి ఎత్తేశారు. ఈ సందర్భంగా విన్ డీజిల్ మీడియాకు చెప్పిన విషయాలు తన మాటల్లోనే చూద్దాం. 
 
"భారతీయులు తీసే చారిత్రాత్మక సినిమాలు చాలా బాగుంటాయి. భారతీయ దర్శకులు పౌరాణిక, చారిత్రక చిత్రాలను చాలా చక్కగా తీస్తారు. వెల్ డన్ బాహుబలి.." అనేశారు విన్ డీజెల్. తెలుగు ప్రేక్షకులకు విన్ డీజెల్ కొత్త కాదు. తను గతంలో నటించిన ట్రిపుల్ ఎక్స్ చిత్రంలో అందరికీ సుపరిచితుడే. హాలీవుడ్ బారీ యాక్షన్ హీరో ఇతడు. అంతర్జాతీయ చలనచిత్ర రంగంలో భారీ యాక్షన్ చిత్రాలకు మారుపేరుగా నిలిచిన విన డీజిల్ ఇండియన్ సినిమా గురించి మాట్లాడటం నిజంగా ఆశ్చర్యమే. అది కూడా తెలుగువాడైన రాజమౌళి తీసిన బాహుబలి-2 గురించి మాట్లాడటం మరీ ఆశ్చర్యం. 
 
విన్ డీజెల్ ఇంకా ఇలా అన్నారు. "ఒక్క షాట్ తీయడానికే హాలీవుడ్‌లో చాలా కష్టపడుతుంటాం. బాహుబలి-2 సినిమాలో కొన్ని షాట్స్ చూస్తే చిత్ర దర్శకులు, నటీనటులు ఎంత కష్టపడ్డారో అర్థమవుతుంది. సాధారణంగా హాలీవుడ్‌లో సహజమైన ప్రాంతాలను ఎంచుకుని షూటింగు తీస్తుంటాం. కానీ భారతీయులు భారీ సెట్లువేసి మరీ షూట్ చేస్తారని విన్నాను. కానీ ఇప్పుడు బాహుబలి 2 చూశాను. భారతీయ దర్శకులకు ఇంత క్రియేటివిటీ ఎక్కడినుంచి వస్తుందో అర్థం కావడం లేదు. భారతీయ దర్శకులకు మంచి ఫైనాన్షియర్లు గానీ దొరికితే.. ప్రపంచాన్నే దున్నేస్తారేమో.." అని విన్ డీజిల్ అన్నారు. 
 
హాలీవుడ్ ప్రముఖులు భారతీయ సినిమాను, ప్రత్యేకించి తెలుగు సినిమాను చూసి ఈ విధంగా స్పందించడం చాలా గొప్పగా ఉంటోంది. సాధారణంగా హిందీకి దగ్గరగా ఉండే హాలీవుడ్ ఇప్పుడు టాలీవుడ్ గురించి ఆలోచిస్తుండటం సంతోషించదగిన విషయం.