Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నయనను బంగారం.. అని పిలిచిన విఘ్నేష్.. ఇక పెళ్లే తరువాయి..

శనివారం, 18 నవంబరు 2017 (17:25 IST)

Widgets Magazine

గోపి నయినార్ దర్శకత్వంలో అగ్ర హీరోయిన్ నయనతార నటించిన అరమ్ సినిమా బంపర్ హిట్ అయ్యింది. లేడి ఓరియెంటెడ్ రోల్‌లో నయన అదరగొట్టేసింది. దీంతో ఆమెను ఫ్యాన్స్‌తో పాటు విశ్లేషకులు కూడా లేడి సూపర్ స్టార్ అంటూ పిలుస్తున్నారు. దక్షిణాది టాప్ హీరోయిన్ అయిన నయన వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతోంది. నయనకు నేడు (నవంబర్ 18) పుట్టినరోజు. 
 
ఈ నేపథ్యంలో నయన లవర్ దర్శకుడు విఘ్నేశ్ శివన్ బర్త్ డే బేబీకి ఎలాంటి గిఫ్ట్ ఇస్తాడని అందరూ ఎదురుచూశారు. ఫ్యాన్స్ ఆత్రుతకు తగినట్టే విఘ్నేష్ కూడా నయనతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేస్తూ.. నయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. 
 
అంతేగాకుండా నయనను ఉద్దేశించి "నీవు ధైర్యవంతురాలని, అందమైనదానివని.. నిన్ను చూసి నేనెంతో గర్వపడుతున్నానని.. నిన్ను గౌరవిస్తున్నాను.. తంగమే (బంగారం)..." అంటూ కామెంట్ జోడించాడు. ఈ కామెంట్‌తో నయన, విఘ్నేష్‌ల మధ్య ప్రేమాయణం ఖరారైపోయిందని.. త్వరలోనే ఈ జంట పెళ్లిపీటలెక్కుతుందని నయన ఫ్యాన్స్ జోస్యం చెప్పేస్తున్నారు. నయన బర్త్ డే రోజున  విఘ్నేష్ చేసిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. 
 
మరోవైపు నయనతార బాలయ్యతో జత కట్టే జై సింహ సినిమా శరవేగంగా జరుగుతోంది. తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించే ఈ సినిమాలో నయన లుక్‌ను ఆమె పుట్టిన రోజు సందర్భంగా యూనిట్ విడుదల చేసింది.


 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

త్రిషను తిట్టిపోసిన స్టార్ ప్రొడ్యూసర్.. ఎందుకంటే?

త్రిష సీనియర్ నటిగా మారిపోయింది. అయినా ఛాన్సులు అమ్మడుకు వెతుక్కుంటూనే వస్తున్నాయి. ...

news

ఆ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు రేణూ దేశాయ్ ఫీలైపోతోందట...

ఇంటర్వ్యూలివ్వడం అంటే మామూలు విషయం కాదు. అప్పటికప్పుడు తెలివిగా సమాధానాలు చెప్పాలి. ...

news

చెలియా ఫ్లాప్ అవుతుందని తెలుసు.. మణిరత్నం కోసమే ఒప్పుకున్నా: కార్తీ

యుగానికి ఒక్కడు, ఆవారా, నా పేరు శివ, శకుని, కాష్మోరా వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ...

news

అనుష్కకు అలాంటి అవకాశం భవిష్యత్తులో కూడా రాదట...

బాహుబలి-2 తరువాత అనుష్క నటించిన చిత్రం భాగమతి. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ...

Widgets Magazine