Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఓపీ-శశికళ ఇద్దరూ బానిసలే.. అమ్మ ఆత్మ చివరికి ఎవరిని దీవిస్తుందో?: రామ్ గోపాల్ వర్మ

సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (13:00 IST)

Widgets Magazine

తమిళనాట రాజకీయ సంక్షోభానికి ఇంకా తెరపడని నేపథ్యంలో.. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నోటికి పనిచెప్పాడు. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుండే రామ్ గోపాల్ వర్మ తమిళ రాజకీయాలపై మరోసారి స్పందించాడు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పాత రోమన్ సామెత ‘యూ టూ బ్రూటస్?’ గుర్తుకొస్తోందని వ్యాఖ్యానించారు. 
 
తమిళ రాజకీయాలపై ట్విట్టర్‌లో స్పందించిన రామ్ గోపాల్ వర్మ.. శశికళ, పన్నీర్ సెల్వంలపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. గతంలో పన్నీర్ సెల్వం బానిసలా ఉండేవారని, ఆ విషయాన్ని గుర్తు చేసుకుని శశికళ ఆశ్చర్యపడుతోందని ట్వీట్‌లో పేర్కొన్న రాంగోపాల్ వర్మ అంతకంటే ముందు తానే ఓ బానిసలా ప్రవర్తించిన విషయాన్ని మాత్రం శశికళ మర్చిపోయిందని పేర్కొన్నారు.
 
ముఖ్యమంత్రి సీటు కోసం అటు అమ్మ నెచ్చెలి.. ఇటు అమ్మ వీరవిధేయుడి మధ్య జరుగుతున్న యుద్ధంలో గెలుపు ఎవరికోనని వర్మ ప్రశ్నించారు. అంతేగాకుండా "జయలలిత ఆత్మ ఏమని ఆలోచిస్తుందో?"అంటూ అనుమానం వ్యక్తం చేయడమే కాకుండా అమ్మ ఆత్మ చివరికి పన్నీరును దీవిస్తుందా? నెచ్చెలి చిన్నమ్మను దీవిస్తుందా? అని సంశయం వ్యక్తం చేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

దిల్ రాజుకు షాక్ ఇచ్చిన నితిన్... 'కాటమరాయుడు'తో నితిన్ పండగ

పవన్‌ కళ్యాణ్‌ 'కాటమరాయుడు' చిత్రం నైజాం ఏరియాలో పోటీ వున్నా దిల్‌ రాజును కాదని నితిన్‌ ...

news

'మా' టీవీ పేరు మారిపోతోంది, లాంఛ్ చేసిన చిరు

చిరంజీవి, నాగార్జున, మ్యాట్రిక్‌ ప్రసాద్‌ భాగస్వాములుగా వున్న 'మా' టీవీని రెండేళ్ళనాడే.. ...

news

దేవుడా.. దేవుడా.. మాయదారి దేవుడా.. ఆ ముగ్గురిలో నాకు జగన్ అంటే ఇష్టం: పోసాని

ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తుల్లో ప్రముఖ నటుడు పోసాని కూడా ఒకరు. గతంలో ప్రజారాజ్యం తరపున ...

news

నాలుగేళ్ల తర్వాత బాహుబలి ప్రభాస్ కొత్త సినిమా నేడే ప్రారంభం

ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి కోసం నాలుగేళ్ల సమయం వెచ్చించిన ప్రభాస్ ...

Widgets Magazine