బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By venu
Last Modified: గురువారం, 25 మే 2017 (18:17 IST)

జయలలిత అనుభవించిన నరకం నాకు తెలుసు.. పవన్, బన్నీ, దాసరి, రానాలకు ప్రాణభిక్ష పెట్టింది నేనే..

అసలు బాహుబలి సాధిస్తున్న రికార్డుల వెనుక ఉన్నది ఎవరు.. దర్శకుడా, ఖర్చుకి వెరవని నిర్మాతా.. కథ అందించిన విజయేంద్రప్రసాదా... మీ పిచ్చి కానీ అసలు వీరికి బాహుబలి రికార్డులకు సంబంధమే లేదు. పండ్లను చూసుకుని మురిసిపోతూ, వేర్లను మర్చిపోయే బాపతుగాళ్లకు తెలియా

అసలు బాహుబలి సాధిస్తున్న రికార్డుల వెనుక ఉన్నది ఎవరు.. దర్శకుడా, ఖర్చుకి వెరవని నిర్మాతా.. కథ అందించిన విజయేంద్రప్రసాదా... మీ పిచ్చి కానీ అసలు వీరికి బాహుబలి రికార్డులకు సంబంధమే లేదు. పండ్లను చూసుకుని మురిసిపోతూ, వేర్లను మర్చిపోయే బాపతుగాళ్లకు తెలియాల్సిన అసలు విషయం మరొకటి ఉంది. బాహుబలి సినిమా చిత్రీకరణ ఆగిపోకుండా ఆపి, భళ్లాలదేవుని పాత్ర పోషించిన రానాకు ప్రాణం పోసిన మహాతల్లి ఒకరున్నారు. ఆమె శ్రీనిజ. పేరు ఎప్పుడూ విన్నట్లు లేదా. తప్పేం లేదులెండి. ఈవిడో సినిమా నటి. సినిమా టైటిళ్లలో స్క్రోలింగ్‌లో కూడా కనిపించకుండా, ఇతరులు అనే గుంపులో ఒకరు. కానీ ఇప్పుడు ఓ పెద్ద బాంబు పేల్చి ఇంటర్వ్యూలు ఇచ్చేస్తోంది.
 
ఈమెకు భగవంతుడు కలియుగంలో కూడా దివ్యశక్తులు ప్రసాదించాడట. ఆ శక్తులేంటయ్యా అంటే చనిపోయేవారు ఈమెకు కలలో కనిపిస్తారట. లేదా కనిపించినవారు చనిపోతారట. అలా చనిపోయినవారిలో మొదటి వ్యక్తి నందమూరి తారక రామారావుగారు. ఈమెకు కనిపించిన ప్రముఖుల్లో ఇంకా ప్రస్తుత సిఎం చంద్రబాబుగారు, దివంగత సిఎం వైయస్, గబ్బర్‌సింగ్-1 ముందు పవన్, ఆర్య-2కి ముందు బన్నీ.. వీరందరినీ ఈమె కాపాడిందట. తమిళనాడు సిఎం జయలలిత ఆత్మ తనను నమ్ముకున్నవారే ఎలా చంపారో చనిపోయిన వెంటనే ఈవిడ వద్దకు వెళ్లి చెప్పుకుని చాలా బాధపడిందట. ఆ బాధతో ఈమె కూడా ఓ వారం పాటు ఏడుస్తూనే గడిపానని, సాధారణంగా మారేందుకు చాలా కష్టపడ్డానని కంటతడి పెట్టుకున్నారు శ్రీనిజ.
 
మరో విడ్డూరం ఏంటంటే.. రామానాయుడుగారు చనిపోయే ముందు భగవంతుడు ఈమెకో ఆఫర్ ఇచ్చాడట. రామానాయుడు చనిపోవాలా, లేక రానా చనిపోవాలా అనేదే ఆ ఆఫర్. కానీ రానాపై ఎక్కువ ఎఫెక్ట్ ఉన్నప్పటికీ, అన్నీ అనుభవించేసిన రామానాయుడుగారు కాలం చేసినా పర్లేదు.. యువకుడు రానాని బతికించమని చెప్పిందట భగవంతుడితో. ఆ ప్రకారం ఆమె సూచనని పరిగణించి రామానాయుడిని తీసుకెళ్లిపోయిన భగవంతుడు రానాని వదిలేసాడు. 
 
ఇటువంటి మాటలు.. ఓ రకంగా ఇంతకు మించి అంతర్జాతీయ స్థాయిలో అమెరికా అధ్యక్షులతో భేటీలు, ప్రపంచ శాంతి అంటూ మాటలు చెప్పి, కొన్నేళ్ల క్రితం రాజకీయపార్టీ సైతం స్థాపించి తర్వాత చిరునామా గల్లంతైన కెఎ పాల్‌ అలియాస్ కిలారి ఆనందపాల్‌ను గుర్తు చేస్తున్న ఈ శ్రీనిజని నెటిజన్లు అందరూ కెఎ పాల్ సిస్టర్ అంటూ సోషల్ మీడియాలో చెడుగుడు ఆడేస్తున్నారు.
 
ఎందరు ఎన్ని కామెంట్లు చేసినా, నమ్మినా నమ్మకపోయినా తను ఈ సమాజానికి సేవ చేస్తూనే ఉంటానని, సాయం అడిగినవారికి కాదనకుండా ప్రాణాలు పోస్తుంటానని చెప్పుకొచ్చారీమె ఓ ఇంటర్వ్యూలో. బీహార్‌లో లాలూగారు ఈమెకు కేంద్ర మంత్రి పదవి కూడా ఇవ్వబోయారని చెప్పుకున్న ఈమె రేపోమాపో దేశానికి ప్రధాని కాబోతున్నానన్నా ఆశ్చర్యపోకండి.