శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 2 జులై 2015 (17:08 IST)

అదే జరిగివుంటే 25 ఏళ్ళకే పెళ్లైవుండేది.. బ్రేకప్ తర్వాత హ్యాపీగా ఉన్నా: త్రిష

ప్రముఖ సినీ నటి త్రిష తన పెళ్లి, పెటాకులు కావడంపై బహిరంగంగా తొలిసారి మాట్లాడింది. తన మనసుకు నచ్చిన వ్యక్తి తారసపడినప్పుడే పెళ్లంటూ చేసుకుంటానని చెప్పింది. వివాహ వ్యవస్థపై నమ్మకం ఉందని, సమాజం కోసం పెళ్లి చేసుకోకూడదని చెప్పింది. సరైన వ్యక్తి తారసపడి ఉండే 25 సంవత్సరాలకే వివాహం చేసుకుని ఉండేదానినని తెలిపింది. వివాహానికి వయస్సు అడ్డం కాదని స్పష్టం చేసింది. తన జీవితంలో ఏం జరిగినా దానిపై సమాధానం చెప్పాల్సింది.. కేవలం తన తల్లికేనని త్రిష స్పష్టం చేసింది. 
 
వరుణ్ మణియన్ తో నిశ్చితార్థం బెడిసి కొట్టడంపై త్రిష మాట్లాడుతూ.. నిశ్చితార్థం రద్దవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయని తెలిపింది. జరిగిపోయిన దానిపై మాట్లాడడం ఇష్టం లేదని త్రిష స్పష్టం చేసింది. ప్రస్తుతం కుటుంబం, స్నేహితులతో సంతోషంగా ఉన్నానని చెప్పింది. త్వరలోనే ఎవరో ఒకరిని ప్రేమించి పెళ్లాడతాను. ఈ సమాజానికి భయపడి ఎవర్నో ఒకరిని పెళ్లి చేసుకునేందుకు తాను సిద్ధంగా లేనని త్రిష తేల్చి చెప్పింది.