Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మా అక్కయ్య ఏడ్చుకుంటూ వస్తే వాడ్ని చంపేయాలనుకున్నా.. సమాజం మారాలి: పవన్

సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (13:40 IST)

Widgets Magazine

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమెరికాలో పర్యటిస్తున్నారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో రాజకీయ పరిస్థితులు ఇతరత్రా అంశాలపై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగంలో మరోసారి ఉత్తరాది, దక్షిణాది అంశాలను లేవనెత్తారు. ఉత్తర భారతీయుల ప్రాబల్యం అంతకంతకు పెరిగిపోతుంటే.. దక్షిణాది వారిపై వివక్ష కొనసాగుతుందని పవన్ విమర్శలు గుప్పించారు. పోరాటం ఎలా ఉండాలో తెలుగువారు తమిళుల నుంచి నేర్చుకోవాలన్నారు. సుప్రీం కోర్టు జల్లికట్టుపై నిషేధం విధించినా పోరాడి మరీ తమ సంప్రదాయాన్ని దక్కించుకున్నారని పవన్ ప్రశంసలు గుప్పించారు. 
 
ఈ సందర్భంగా తన చిన్ననాటి స్మృతులను కూడా పవన్ గుర్తు చేసుకున్నారు. తన తండ్రి విధుల్లో భాగంగా రెండేళ్లకోసారి బదిలీ అయి వేరే చోటికి వెళుతుంటే, ప్రతి ఊరిలో తమను వేరే వాళ్లుగా చూసేవారని చెప్పుకొచ్చారు. తాను ఏడో తరగతి చదువుతున్న సమయంలో మా అక్కయ్య ఏడ్చుకుంటూ ఇంటికొచ్చింది. వచ్చేదారిలో ఎవడో పోకిరి తన చెయ్యిపట్టుకుని వేధించాడని చెప్పింది. ఆ దృశ్యాన్ని ఎందరో చూసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.

కానీ తనకు మాత్రం ఆ దుర్మార్గుడిని చంపేయాలన్నంత కోపం వచ్చిందని పవన్ చెప్పారు. అలాంటి వారిపై చూస్తున్న జనం ఎందుకు స్పందించరనేదేనని పవన్ తెలిపారు. అవినీతి సమాజం, అవినీతి రాజకీయాల వల్లనే ఇలా జరుగుతోందని తెలుసుకున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రలోభపెట్టేవారికి చట్టాలు అనుకూలంగా పనిచేయడం దురదృష్టకరం. మన సమాజం మారాలని పవన్ పేర్కొన్నారు. 
 
ఏపీ గురించి మాట్లాడుతూ.. ఏపీని విభజించిన విధానం నన్ను చాలా బాధించిందని చెప్పారు. 17 సంవత్సరాల పాటు కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టి, ఆపై అకస్మాత్తుగా నిర్ణయం తీసుకున్నారు. సరైన విధానం, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా విభజించారు. ఇండియాలో ఒకే భాష మాట్లాడుతున్న తెలుగువారిని విభజన పేరిట దూరం చేశారు. అంతరాలు పెంచారు. దేశాన్ని ప్రేమించే వ్యక్తిగా ఈ పరిణామం బాధించింది. ఏం చేయాలో తెలియలేదు. ఆపై మిత్రులతో చర్చించిన మీదటే రాజకీయాల్లోకి వచ్చాను. ఆపై ఏం జరుగుతూ ఉందో మీ కందరికీ తెలిసిందే" అని పవన్ వెల్లడించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఓపీ-శశికళ ఇద్దరూ బానిసలే.. అమ్మ ఆత్మ చివరికి ఎవరిని దీవిస్తుందో?: రామ్ గోపాల్ వర్మ

తమిళనాట రాజకీయ సంక్షోభానికి ఇంకా తెరపడని నేపథ్యంలో.. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ...

news

దిల్ రాజుకు షాక్ ఇచ్చిన నితిన్... 'కాటమరాయుడు'తో నితిన్ పండగ

పవన్‌ కళ్యాణ్‌ 'కాటమరాయుడు' చిత్రం నైజాం ఏరియాలో పోటీ వున్నా దిల్‌ రాజును కాదని నితిన్‌ ...

news

'మా' టీవీ పేరు మారిపోతోంది, లాంఛ్ చేసిన చిరు

చిరంజీవి, నాగార్జున, మ్యాట్రిక్‌ ప్రసాద్‌ భాగస్వాములుగా వున్న 'మా' టీవీని రెండేళ్ళనాడే.. ...

news

దేవుడా.. దేవుడా.. మాయదారి దేవుడా.. ఆ ముగ్గురిలో నాకు జగన్ అంటే ఇష్టం: పోసాని

ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తుల్లో ప్రముఖ నటుడు పోసాని కూడా ఒకరు. గతంలో ప్రజారాజ్యం తరపున ...