Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

1998లోనే నాపై రేప్ జరిగింది.. హాలీవుడ్‌లోనే మహిళలకు జీతాలు తక్కువే: ఆష్లే జడ్

మంగళవారం, 31 జనవరి 2017 (13:39 IST)

Widgets Magazine

ప్రముఖ హాలీవుడ్ నటి, సామాజిక కార్యకర్త ఆష్లే జడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆష్లే అమెరికాలోని ప్రముఖ మ్యూజిక్‌ స్టార్‌ నయోమి జడ్‌ కుమార్తె. గతంలో కూడా ఆష్లే తనను హాలీవుడ్‌ స్టూడియో ఎగ్జిక్యూటివ్‌ ఒకరు లైంగికంగా వేధించారని వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పాలసీలను వ్యతిరేకించిన హాలీవుడ్‌ సెలబ్రిటీలలో ఆష్లే కూడా ఒకరు.
 
ఈ నేపథ్యంలో తానూ చిన్నతనంలోనే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని.. పద్నాలుగేళ్లకే అత్యాచారానికి గురయ్యానని ఆష్లే జడ్ బహిర్గతం చేశారు. బాలికలు, మహిళలపై లైంగిక హింసకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన ప్రపంచ స్థాయి సమావేశాల్లో ఆష్లే మాట్లాడుతూ.. లింగవివక్ష గురించి, మహిళలపై అకృత్యాల గురించి ప్రసంగించిన ఆష్లే తానూ ఆ హింసకు బాధితురాలినేనని చెప్పారు. 1998లోనే తనపై అత్యాచారం జరిగిందని.. తాను ఏడేళ్ల వయస్సులో లైంగిక వేధింపులకు గురయ్యానని తెలిపారు.
 
కానీ తాను అక్రమ రవాణా బారిన పడకపోవడం మాత్రం అద్భుతమంటూ ఆష్లే (48) అక్రమ రవాణా బాధితుల పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై లైంగిక దోపిడి, హింస, లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. హాలీవుడ్‌లోనూ లింగ వివక్ష చూపుతున్నారని, నటీనటులకు ఇచ్చే పారితోషికంలో చాలా తేడా ఉంటోందన్నారు. పురుషులతో పోలిస్తే సంపాదించాల్సిన దాని కంటే 40శాతం తక్కువ సంపాదిస్తున్నానని ఆష్లే చెప్పారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బండ్ల గణేష్ అమ్మాయిలను సప్లై చేసే బ్రోకరా? ఆ హీరోయిన్ ఏమంటోంది?

సినిమాల్లో హీరోల పక్కన చిన్నచిన్న క్యారెక్టర్లు వేస్తూ వచ్చి బండ్ల గణేష్... కాలక్రమంలో ...

ముంబై మోడల్స్‌కు అల్లు అర్జున్ సీరియస్ వార్నింగ్.. నా గెటప్ లీకైతే తాట తీస్తా..!

ప్రస్తుతం సెల్ఫీ పిచ్చి అంతా ఇంతా కాదు. సెల్ఫీలు తీసుకోవడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. ...

news

దర్శకరత్న దాసరికి తీవ్ర అస్వస్థత : ఐసీయూలో అడ్మిట్

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన దర్శక దిగ్గజం దాసరి నారాయణ రావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ...

news

బాహుబలి-2 పోస్టర్‌పై నెట్టింట్లో రచ్చ.. అనుష్క విల్లుపై ప్రభాస్ బాణాలు ఎలా వచ్చాయ్

బాహుబలి కొనసాగింపుగా వస్తున్న బాహుబలి-2 పోస్టర్ రెండు రోజుల క్రితం విడుదలైన సంగతి ...

Widgets Magazine