శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: సోమవారం, 8 ఫిబ్రవరి 2016 (16:41 IST)

అమీర్ ఖాన్ పరిస్థితి ఎలా అయిపోయింది... సన్నీ లియోన్‌తో కూడా సరేనా...?!!

మన పెద్దవారు ఓ సామెత చెప్తుంటారు... అదే ఓడలు బండ్లు, బండ్లు ఓడలవుతాయని. ఇప్పుడు బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ పరిస్థితి అలాగే అయిపోయినట్లుంది. అసహనం వ్యాఖ్యలకు ముందు ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీలో 1000 వోల్టుల వెలుగులా వెలిగిపోయిన అమీర్ ఖాన్ కెరీర్ ఇపుడు '0' వాట్ బల్పులా మసకబారిపోతోంది. చివరికి పోర్న్ స్టార్ సన్నీలియోన్ తో కూడా నటించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని మళ్లీమళ్లీ చెప్తున్నానని అంటున్నాడు. 
 
మస్తీజాదే చిత్రంలో అందాలన్నీ ఆరబోసి పోర్న్ స్టార్ సన్నీ లియోన్‌తో తనకు నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెపుతున్నాడు. సన్నీ లియోన్ ఫ్యాన్ క్లబ్బులో తను కూడా చేరిపోయినట్లే అతడు చేసిన ప్రకటనతో తెలుస్తోంది. అంతేకాదు... సన్నీ లియోన్, ఆమె భర్తను భోజనానికి కూడా ఆహ్వానించాడు. 
 
అసలిది ఎలా జరిగిందంటే... అమీర్ తన తాజా చిత్రం డంగల్ చిత్రం షూటింగ్ ఢిల్లీలో జరుగుతుండగా అందులో పాల్గొంటున్నాడు. సన్నీ కూడా నగరంలోనే ఉందట. దాంతో ఆమెతో పాటు ఆమె భర్తను భోజనానికి ఆహ్వానించి సన్నీతో నటించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాడట. అంతేకాదండోయ్ ఆ మరుసటిరోజు తన డంగల్ షూటింగ్ స్పాట్ కు సన్నీని పిలుచుకొచ్చి అందరికీ పరిచయం కూడా చేశాడట. వెళ్లేముందు అమీర్ ఖాన్ ఆమెకు ఓ వేడివేడి హగ్ కూడా ఇచ్చాడట. అదీ సంగతి.