Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సూసైడ్ చేసుకోవాలని భావించిన గోవా బ్యూటీ

సోమవారం, 6 నవంబరు 2017 (15:29 IST)

Widgets Magazine

గోవా బ్యూటీ ఇలియానా. స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయం చేసిన హీరోయిన్. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో వచ్చిన అనేక చిత్రాల్లో ఈ గోవా బ్యూటీ నటించి మంచి గుర్తింపు పొందడమేకాకుండా, తెలుగు స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. కాలక్రమంలో ఈ అమ్మడికి అవకాశాలు లేకపోవడంతో తన ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేస్తోంది. పైగా, అపుడపుడూ ఈతకొలనులో ఉంటూ అదిరిపోయే ఫోటోలను తీయించి, తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తూ తానున్నట్టు సినీ అభిమానులకు గుర్తుచేస్తుంది.
ileana
 
అయితే, ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ మెంటల్ హెల్త్ అనే కార్యక్రమానికి ఈ భామ హాజరైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తన జీవితంలో ఎదుర్కొన్న ఒత్తిళ్ల గురించి వివరించింది. తన శరీరం గురించి పలువురు పలు రకాల కామెంట్స్ చేసినప్పుడు తాను చాలా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిందట. ఒకానొక టైంలో సూసైడ్ కూడా చేసుకోవాలని భావించిందట. కానీ అంతలోనే తనకి తానే ధైర్యం చెప్పుకొని నార్మల్ స్టేజ్‌కి వచ్చానని చెబుతోంది ఇలియనా. 
 
డిప్రెషన్ నుండి బయటపడాలంటే ముందుగా మనకు మనం ధైర్యం తెచ్చుకోవాలని అంటుంది గోవా బ్యూటీ. డిప్రెషన్‌లోకి వెళ్లినప్పుడు వెంటనే వైద్యులని సంప్రదించాలి లేదంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని తన అనుభవాన్ని వెల్లడించింది. నటీమణులు అందంగా కనిపించడానికి రెండు గంటల సమయం పడుతుంది, కానీ మనసు ప్రశాంతంగా ఉంటే ఎలాంటి మేకప్‌లు లేకుండా చాలా గ్లామర్‌గా కనిపిస్తారని ఈ సన్నజాజితీగనడుం చిన్నది చెపుతోంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'గరుడవేగ' కోసం కోట్ల ఆస్తి తాకట్టు... అందుకే 'జెంటిల్‌మెన్' వదులుకున్నా... రాజశేఖర్

గరుడవేగ చిత్రం సక్సెస్ బాటలో నడుస్తుండటంతో హీరో రాజశేఖర్ కు ఊపిరి వచ్చినట్లయింది. ఈ ...

news

రూ.1000 కోట్లతో పౌరాణిక చిత్రం... హీరోలు ఎవరంటే?

మలయాళ చిత్ర పరిశ్రమలో రూ.100ో0 కోట్లతో పౌరాణిక చిత్రం తెరకెక్కనుంది. అవును. ఈ వార్త ...

news

చెన్నైలోని ఎన్టీఆర్ నివాసాన్ని అమ్మేస్తారా? గండిపేట కుటీరంపై లక్ష్మీపార్వతీ ఏమన్నారు?

లెజెండరీ నటుడు, తెలుగు తెరకి స్టార్ స్టేటస్ తెచ్చిన తొలితరం హీరో, అంతకుమించి ఆనాటి ...

news

'గరుడవేగ' హీరో రాజశేఖర్ పెద్ద కుమార్తెపై కేసు

'పీఎస్వీ గరుడవేగ' చిత్రం విజయోత్సవంలో మునిగితేలుతున్న హీరో రాజశేఖర్‌, జీవిత రాజశేఖర్‌ ...

Widgets Magazine