శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 27 నవంబరు 2015 (13:12 IST)

లవర్‌ని వదిలేశానా.. అవన్నీ పుకార్లే.. ఆయన ఆస్ట్రేలియాలో ఉన్నాడు: ఇలియానా

బాలీవుడ్‌లో అడుగెట్టిన ఇలియానా ఈ మధ్య ఛాన్సులతో బిజీ అయిపోయింది. అయితే ఇలియానా లవర్‌కి టాటా చెప్పేసి మరొకరితో డేటింగ్ చేస్తోందంటూ జోరుగా ప్రచారం సాగింది. దీనిపై ఇలియానా మాట్లాడుతూ.. కథలు వింటున్నానంటూ కాలక్షేపం చేస్తూనే.. తాను ఒక విదేశీయుడితో ప్రేమలో పడినట్లు చెప్పింది. అయితే తన లవర్‌ని వదిలి బాలీవుడ్ హీరోతో డేటింగ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తల్ని అమ్మడు కొట్టి పారేసింది. 
 
నిజమైన లవర్ పనిమీద ఆస్ట్రేలియా వెళ్లాడని అసలు విషయం చెప్పింది. అతనికి ఫోన్లో తాను టచ్‌లోనే వున్నానని వెల్లడించింది. తాను లవర్‌ని వదిలేసి మరొకరి లవ్‌లో పడ్డానంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని.. అవన్నీ పుకార్లేనని ఇలియానా స్పష్టం చేసింది.