గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 29 సెప్టెంబరు 2016 (13:07 IST)

పాకిస్థాన్‌కు బాలీవుడ్‌ బంద్‌.. 70 శాతం ఆదాయం కట్‌.. మూతపడనున్న థియేటర్లు

పాకిస్థాన్‌ను పీచమణిచేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాలుగు వైపుల నుంచి అస్త్రాలను సంధిస్తున్నారు. ఇందులోభాగంగా, ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకోవాలని మోడీ ప్రభుత్వం ఓ స్పష్టతతో ముందుకు సాగుతోంది.

పాకిస్థాన్‌ను పీచమణిచేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాలుగు వైపుల నుంచి అస్త్రాలను సంధిస్తున్నారు. ఇందులోభాగంగా, ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకోవాలని మోడీ ప్రభుత్వం ఓ స్పష్టతతో ముందుకు సాగుతోంది. ఇందులోభాగంగా మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను రద్దు చేయడంతో పాటు.. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకునే దిశగా కీలక అడుగులు వేస్తోంది. తాజాగా ఇస్లామాబాద్ వేదికగా జరుగనున్న సార్క్ మహానాడును బాయ్‌కట్ చేయాలని భారత్ నిర్ణయించింది. దీంతో ఏకంగా సదస్సునే రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
ఇలా ఇరు దేశాల మధ్య భారత, పాక్‌ నడుమ సంబంధాలు క్షీణిస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్‌లో భారతీయ సినిమాలను విడుదల చేయకూడదన్న అంశాన్ని భారతీయ నిర్మాతలు పరిశీలిస్తున్నారు. ఇదే జరిగితే పాక్‌ సినీ పరిశ్రమ 70 శాతం ఆదాయాన్ని కోల్పోతుందని అక్కడ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. పాక్‌ సినీ పరిశ్రమకు ప్రస్తుతం సమకూరుతున్న ఆదాయంలో 70 శాతం బాలీవుడ్‌ సినిమాల ద్వారానే సమకూరుతోంది. 
 
వాటిపై నిషేధం విధిస్తే దేశంలోని చాలా సినిమా థియేటర్లు మూతపడుతాయని ప్రముఖ పాక్‌ సినీ పంపిణీదారుడు నదీమ్‌ తెలిపారు. కొన్ని బాలీవుడ్‌ సినిమాలు పాకిస్థాన్‌లో రూ.100 కోట్ల వరకు వసూలు చేయడం గమనార్హం. ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్థాన్‌తో అన్నిరకాల బంధాలనూ పక్కన పెట్టాలని భారత భావిస్తోంది. అందులో భాగంగా రెండు దేశాల నడుమ జరిగే క్రికెట్‌ మ్యాచ్‌లపైనా ఆంక్షలు విధించే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు.