Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దక్షిణాది సినిమాల గుప్పిట్లో భారత మూవీ మార్కెట్.. హిందీ సినిమా మారకపోతే ఇంతే సంగతులు

హైదరాబాద్, గురువారం, 18 మే 2017 (08:35 IST)

Widgets Magazine
prabhas

ఇప్పుడు చిత్రపరిశ్రమ నిజంగానే వణికిపోతోంది. ఒక దక్షిణాది సినిమా, ఒక తెలుగు సినిమా దేశీయ మార్కెట్‌ను కొల్లగొట్టడమే కాదు ప్రపంచ స్థాయిలో రికార్డులను కూడా బద్దలు కొడుతున్న వైనం చూస్తూ ఏం చేయాలి అనే డైలమ్మాలోబాలీవుడ్ పడిపోయింది. అటు హాలీవుడ్ సినిమాలు ఇప్పటికే హిందీ సినిమా వ్యాపారాన్ని తమవైపు మళ్లించుకుంటున్న సమయంలో ప్రాంతీయ సినిమా అయిన బాహుబలి-2 హిందీ ప్రాంతంలో కనీవీనీ ఎరుగని రికార్డును సొంతం చేసుకుంటూ ఉండటం బాలీవుడ్ ప్రముఖులను ఆలోచనలో పడవేసింది.
 
ప్రముఖ బాలీవుడ్, హాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మాటల్లో ఇదే బయటపడింది. బాహుబలి-2 నిజంగానే టాలీవుడ్ అందించిన విజువల్ వండర్ అని మెచ్చుకుంటూనే హిందీ సినిమా మారాల్సిన సమయం వచ్చిందని తేల్చి చెప్పేశాడు ఇర్పాన్. ‘‘బాహుబలి వంటి దక్షిణాది సినిమాలు భారత దేశంలోని మొత్తం మార్కెట్‌ను గుప్పెట్లోకి తెచ్చుకునేలా పుంజుకుంటున్నాయి. కాబట్టి హిందీ సినిమాలు మరింత మంచి సబ్జెక్టులతో ముందుకు రావాల్సిన అవసరం ఉంది’’ అని వ్యాఖ్యానించాడు.
 
రెండు రోజుల క్రితం షారుఖ్ ఖాన్ కూడా టెక్నాలజీని భారీ స్థాయిలో ఉపయోగించడమే బాహుబలి-2 అద్బుత విజయానికి కారణం అని స్పష్టం చేశారు. భారీ పెట్టుబడి పెట్టగల దమ్ము లేకపోతే బాహుబలి-2 వంటి సినిమాల వైభవం రాదని చెప్పారు. మొత్తం మీద బాహుబలి-2 బాలీవుడ్ ప్రముఖులను ఆలోచింప చేస్తున్నట్లుంది.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Warned Bollywood Irfan Khan Bahubali2. Success

Loading comments ...

తెలుగు సినిమా

news

దేశవ్యాప్తంగా బాహుబలి-2 పైరసీ.. 6 లక్షలపైగా డౌన్‌లోడ్‌లు.. అయినా తగ్గని కలెక్షన్లు. ఎలా?

అయితే ఇంత విస్తృతంగా పైరసీ కాపీలు బయటికి వచ్చినప్పటికీ బాహుబలి-2 సినిమా భారీ కలెక్షన్లకు ...

news

అందాలన్నీ చూపిస్తున్నా... నా చిత్రాలకు పిల్లలను తీసుకురావొద్దు : తల్లిదండ్రులకు ప్రియాంకా చోప్రా వినతి

టూ పీస్ బికినీ దుస్తుల్లో చెలరేగిపోతున్న బాలీవుడ్ హీరోయిన్లలో ప్రియాంకా చోప్రా కూడా ...

news

'లవ్‌ మామా.. యు ఆర్ లుకింగ్ సూపర్'.. 'కంగ్రాట్స్‌ కోడలా'... ఇలా అన్నది ఎవరు?

వెండితెర హీరో, హీరోయిన్లు మామా కోడలు కానున్నారు. వారెవరో ఇప్పటికే అర్థమైపోయివుంటుంది. ...

news

సినీ ఛాన్స్ అడిగితే లైంగిక సుఖం ఇవ్వమని అడుగుతున్నారు.. : లక్ష్మీ రాయ్ బాంబు

లక్ష్మీరాయ్ లేదా రాయ్ లక్ష్మీ ఇలా ఏ పేరు పెట్టుకున్న ఆమెకు అదృష్టం కలిసిరావడం లేదు. ఐటం ...

Widgets Magazine