Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాహుబలి-2‌లో బాలీవుడ్ బాద్‌షా.. నిజమా, చీఫ్ ట్రిక్స్‌లో భాగమా?

హైదరాబాద్, మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (04:56 IST)

Widgets Magazine
bahubali part 2

భారతీయ చలనచిత్ర రంగంలో సంచలనం సృష్టించిన చిత్రం బాహుబలి. ప్రపంచ చలనచిత్ర చరిత్రలో ఒక విజువల్ వండర్‌గా నిలిచి రికార్డులను బద్దలు గొట్టిన ఆ చిత్రం రెండో భాగం కోసం దేశమంతా ఆతృతగా ఎదురుచూస్తోంది. షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రం ఏప్రిల్ 28న విడుదల కాబోతుండగా ఇప్పుడు మరొక ట్విస్ట్ వచ్చింది. 
 
కట్టప్ప, బాహుబలిని ఎందుకు చంపాడన్న సమాధానం తెలుసుకునేలోపు మరో ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. బాహుబలి-2 ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ ఓ ప్రముఖ పాత్ర పోషించబోతున్నాడని సమాచారం. బాహుబలి దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి ప్రస్తుతం షారూఖ్ ఖాన్‌తో సంప్రదింపులు జరుపుతున్నాడని తెలిసింది. 
 
2015లో విడుదలైన బాహుబలి-1 అప్పటివరకు ఉన్న రికార్డులను బద్దలుకొట్టింది. ఏప్రిల్ 28న బాహు‌బలి-2 విడుదల కానుండగా.. షారూఖ్ పాత్ర వార్తలు మరింత ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంకా ఏ విషయం ధృవీకరణ లేనప్పటికీ.. షారూఖ్ ఉంటే బాహుబలి-2కి అస్సెట్ అవుతుందని సినీ వర్గాలు అంటున్నాయి.
 
అయితే బాహుబలి 2లో బాలీవుడ్ స్టార్ హీరోను నటింపజేయాలని భావించి ఉంటే రాజమౌళి ఇంత ఆలస్యంగా ఎందుకు పూనుకుంటున్నాడన్నది ప్రశ్న. హిందీ మార్కెట్‌ను మరింత కొల్లగొట్టాలని అనుకుంటే ఎంతో ముందుగా ప్లాన్ చేసుకుని ఉండేవారని, ఇంత అదరాబాదరాగా షారూక్‌ని రంగంలోకి దింపాల్సిన అవసరం ఏమిటని ఫిలిం క్రిటిక్స్ సందేహం. 
 
ఏదేమైనా ప్రచారం కోసం చేస్తున్న చీఫ్ ట్రిక్‌లో ఇది భాగమా లేక నిజంగానే షారుక్‌ని సినిమాలో ఏదో ఒక చోట ఇరికిస్తున్నారా అనేది రాజమౌళి స్వయంగా చెబితే కానీ తెలీదు.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

శరవేగంగా ప్రభాస్ కొత్త సినిమా.. ఖర్చు రూ.150 కోట్ల మాత్రమేనట

ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది. నాలుగేళ్లపాటు తన ...

news

బుద్ధుడి ముందు అలా చేయడం సాధారణం అంటోన్న హాట్ యాంకర్

యాంకర్‌గా హాట్‌హాట్‌గా తన గ్లామర్‌తో కవ్వించే అనసూయ.. సినిమాలోనూ కవ్వించే ప్రయత్నం ...

news

అన్నయ్యతో కలిసి సినిమానా... హహ్హహ్హ్హ... పగలబడి నవ్విన పవన్ కళ్యాణ్

చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌తో కలిసి సినిమా చేయనున్నట్లు టి. సుబ్బిరామిరెడ్డి ప్రకటించడం.. ...

news

మగాళ్లతో కలిసి కనిపించాలంటేనే భయం-షారూఖ్‌తో శృంగార సంబంధం లేదు: కరణ్ జోహార్

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ స్వలింగ సంపర్కుడని తన ఆత్మకథలో చెప్పడం.. ప్రస్తుతం ...

Widgets Magazine