శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 26 జులై 2016 (12:44 IST)

తెరపై నవ్విస్తా.. తెర వెనుక ఏడుస్తా.. ఆ విషాదం బయటకు చెప్పుకోలేను : జబర్దస్త్ ఫేం ఆర్.పి!

తెరపై నవ్విస్తూ.. తెరవెనుక ఏడుస్తున్నట్టు 'జబర్దస్త్' ఫేం ఆర్.పి అలియాస్ రాటకొండ ప్రసాద్ అన్నారు. అయితే, ఈ విషాదాన్ని తాను బయటకు వెల్లడించలేనని ఆయన చెప్పాడు.

తెరపై నవ్విస్తూ.. తెరవెనుక ఏడుస్తున్నట్టు 'జబర్దస్త్' ఫేం ఆర్.పి అలియాస్ రాటకొండ ప్రసాద్ అన్నారు. అయితే, ఈ విషాదాన్ని తాను బయటకు వెల్లడించలేనని ఆయన చెప్పాడు. ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ... నవ్వించే తన వెనుక విషాదం దాగి ఉందన్నారు. ఓ మారుమూల పల్లెటూరుకు చెందిన తాను సినీ పరిశ్రమలోకి వచ్చేందుకు నానా కష్టాలు పడ్డానన్నారు. అయితే చిన్నప్పటి నుంచి నవ్వించడం తనకు దేవుడిచ్చిన వరంగా భావిస్తానన్నారు. 
 
ఆ వరంతోనే నేను ఈ రోజు బుల్లితెరలో వస్తున్న జబర్ధస్త్‌లో ఆర్‌పీగా అందరి మన్ననలు పొందుతూ గుర్తింపు పొందానన్నారు. కొందరు ఎక్కువగా మాట్లాడతానని, మాటలు తగ్గించమని సలహా ఇచ్చేవారని, అయినా నా పంధా మార్చుకోలేదన్నారు. 
 
అన్నపూర్ణ హోటల్‌లో సప్లయర్‌గా పనిచేస్తూ, అనుపమ హోటల్‌కి బస్తాలు మోస్తూ వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ సినిమాల్లో అవకాశాల కోసం వెంపర్లాడినట్టు చెప్పారు. నేను స్వయంగా రచించిన కథ ప్రముఖ నటుడు శ్రీహరికి నచ్చడంతో సినిమా తీసేందుకు 2013 ఆగస్టు 13న బలశాలి చిత్రాన్ని ఆర్‌పీ దర్శకత్వంలో నటిస్తున్నట్లు ప్రకటించారు. దురదుష్టవశాత్తు ఆయన అక్టోబరు 9న కన్నుమూశారన్నారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న తాను పిచ్చి ప్రేమ అనే షార్ట్‌ ఫిల్మ్‌ తీయడంతో దానికి నేషనల్‌ అవార్డు వచ్చింది. 
 
ఈ దశలో జబర్దస్త్‌ ఒక ఊపు ఊపుతుంది. దీంతో ధన్‌రాజ్‌ అన్నను కలిసి అవకాశమివ్వమని కోరడంతో ఆయన స్క్రిప్ట్‌ రాయమన్నారు. నేను ఎగరేస్తే ఎత్తుకెళతా స్క్రిప్ట్‌ రాశాను. దానితో జబర్దస్త్‌లో నా ప్రయాణం మొదలైందని చెప్పుకొచ్చారు. డైరెక్టర్‌ కావాలన్నదే జీవిత లక్ష్యం. జబర్ధ్‌స్త్‌లో నాకు నచ్చిన నటుడు ఆర్‌పీ అని మెగాస్టార్ చిరంజీవి అనడం నాకు జీవితంలో మరచిపోలేని మాటగా నిలిచిపోయిందని ఆర్.పి చెప్పుకొచ్చారు.