Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అక్క కూతురుని పెళ్లి చేసుకోమన్నారు.. వద్దన్నా.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడలేదు : 'జబర్దస్త్' వినోద్

శుక్రవారం, 12 మే 2017 (15:00 IST)

Widgets Magazine
vinod

తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు, అందులో గాయపడినట్టు వచ్చిన వార్తలపై 'జబర్దస్త్' వినోద్ అలియాస్ వినోదిని స్పందించారు. తనకు ఆరోగ్యం బాగోలేదని, ఈ కారణంగా తన తల్లిదండ్రులు ఈనెల 8వ తేదీన కడపలోని ఓ చర్చికి తీసుకెళ్లారన్నారు. ఆ సమయంలో తన అక్క కుమార్తె కూడా అక్కడకు రాగా పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులంతా ప్రతిపాదన చేశారని చెప్పారు. ఈ పెళ్లిని సున్నితంగా తిరస్కరించానని చెప్పాడు. 
 
అక్కడ జరిగింది ఇదైతే... తనను కుటుంబ సభ్యులు కిడ్నాప్ చేశారని, ఆత్మహత్యాయత్నం చేశానని, తన చేతులకు గాయాలయ్యాయని.. ఇలా ఎవరికి తోచినట్టు వారు సోషల్ మీడియాలో ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తంచేశాడు. మరో ఐదేళ్ల వరకు అలాంటి ప్రతిపాదన వద్దని స్పష్టం చేశానని, ఆఫర్లు ఇప్పుడిప్పుడే వస్తున్నాయని, పరిశ్రమలో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న తాను తొందరపడి పెళ్లి చేసుకోలేనని చెప్పానని తెలిపాడు.
 
తనకు సోషల్ మీడియా అంటే ఎంతో గౌరవం ఉందని, దాన్ని పోగొట్టవద్దని విజ్ఞప్తి చేశారు. ఇకపోతే... తొలిసారి తాను లేడీ గెటప్ వేసినప్పుడు 'అబ్బ.. భలే మేకప్ చేశారే...' అనిపించిందని చెప్పాడు. వినోదినిగా పాప్యులర్ కావడంతో అలాంటి లేడీ గెటప్ అవకాశాలే వస్తున్నాయని తెలిపాడు. వినోదినిగా భ్రమించి చాలా మంది ప్రపోజల్స్ చేశారని, చాలా మంది గిఫ్టులు కూడా పంపుతుంటారని వినోద్ తెలిపాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'బాహుబలి'లో నా కుమారుడు అద్దెగర్భం ద్వారా పుట్టాడు : భల్లాలదేవ

'బాహుబలి 2' చిత్రంలో మహిష్మతి రాజు భల్లాలదేవుడికి ఓ కుమారుడు ఉంటాడు. ఈ చిత్రంలో ...

news

'బాహుబలి'ని మించిన చిత్రాన్ని నిర్మించాలి.. ఏకమవుతున్న బాలీవుడ్

ఏప్రిల్ 28వ తేదీకి ముందు వరకు భాతీయ చలనచిత్ర పరిశ్రమ అంటే కేవలం బాలీవుడ్ మాత్రమే. దేశంలో ...

news

పవన్ కళ్యాణ్ కోసం కథ రాస్తా.. త్వరలోనే కలిసి పనిచేస్తాం : 'బాహుబలి' స్టోరీ రైటర్

హీరో పవన్ కళ్యాణ్‌పై 'బాహుబలి' కథ రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రపంసల వర్షం కురిపించారు. ...

news

జనసేనలోకి 'భీమవరం కుర్రోడు' సునీల్...

భీమవరం కుర్రోడు సునీల్. మొదట్లో కమెడియన్‌గా చేరి తెలుగు సినీపరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక ...

Widgets Magazine