మ‌హేష్ - జ‌గ్గుభాయ్ మ‌ధ్య ఏం జ‌రిగింది? క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి

Mahesh-Jagapati
శ్రీ| Last Modified శనివారం, 20 జులై 2019 (17:38 IST)
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు - స‌క్స‌స్‌ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ చిత్రం స‌రిలేరు నీకెవ్వ‌రు. ఇటీవ‌ల ప్రారంభ‌మైన ఈ సినిమాని మ‌హేష్ బాబు, దిల్ రాజు, అనిల్ సుంక‌ర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం కాశ్మీర్లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. మ‌హేష్ బాబు, రాజేంద్ర‌ప్ర‌సాద్‌ల‌తో పాటు మ‌రికొంత మంది ముఖ్య తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు.

ఇదిలా ఉంటే... ఈ చిత్రం నుంచి జ‌గ‌ప‌తి బాబు త‌ప్పుకున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత దీనికి కార‌ణం... డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి జ‌గ‌ప‌తి బాబు క్యారెక్ట‌ర్ నిడివి త‌గ్గించార‌ని.. అది న‌చ్చ‌క‌పోవ‌డం వ‌ల‌నే జ‌గ్గుభాయ్ ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకున్నార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. అయితే.. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త‌లపై అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు.

ఇంత‌కీ ఏమ‌న్నారంటే... ఈ చిత్రంలోని జ‌గ‌ప‌తి బాబు గారి పాత్ర ఆయ‌న‌కు ఎంత‌గానో నచ్చింది. ఈ సినిమాలో న‌టించ‌డానికి ఆయ‌న ఎంత‌గానో ఇంట్ర‌ెస్ట్ చూపించారు. అయితే... కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల‌న ఈ మూవీలో న‌టించ‌డం కుద‌ర‌లేదు. భ‌విష్య‌త్‌లో ఆయ‌న‌తో క‌లిసి వ‌ర్క్ చేయాల‌నుకుంటున్నాను. మమ్మ‌ల్ని అర్ధం చేసుకున్నంద‌కు థ్యాంక్స్ అని తెలియ‌చేసాడు.దీనిపై మరింత చదవండి :