Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఓవర్సీస్‌లో ప్రిన్స్ వర్సెస్ యంగ్ టైగర్ ... "స్పైడర్ - జై లవ కుశ" కాసుల వర్షం

గురువారం, 5 అక్టోబరు 2017 (14:07 IST)

Widgets Magazine
jai lava kusa - spyder

దసరా పండుగకు ఇద్దరు అగ్రహీరోల చిత్రాలు విడుదలయ్యాయి. వీటిలో ఒకటి జూనియర్ ఎన్టీఆర్ నటించిన "జై లవ కుశ" కాగా, మరొకటి మహేష్ బాబు నటించిన "స్పైడర్". అలాగే, శర్వానంద్ హీరోగా తీసిన 'మహానుభావుడు' కూడా విడుదలైంది. ఈ మూడు చిత్రాల్లో ఎన్టీఆర్, మహేష్ బాబుల చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. 
 
ముఖ్యంగా, మహేశ్‌బాబు ఓ అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు. టాలీవుడ్‌లో ఏ హీరోకు లేని ఓ రికార్డును మహేశ్ నెలకొల్పాడు. ఓవర్సీస్‌లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు 1.5 మిలియన్ డాలర్ల సినిమాలతో ఓవర్సీస్ కింగ్ అనిపించుకుంటున్నాడు. మహేశ్ హీరోగా, రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా, మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన 'స్పైడర్' సినిమా.. యాక్షన్ థ్రిల్లర్‌గా అభిమానులను అలరిస్తోంది. ఓవర్సీస్‌లో 'బాహుబలి' తర్వాత అత్యధిక థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. ప్రీమియర్ల ద్వారానే ఒక మిలియన్ డాలర్‌ను కలెక్ట్ చేసింది. అమెరికాలో సెప్టెంబర్ 28న.. అంటే మంగళవారం విడుదలైన ఈ సినిమా.. వారం ముగిసేనాటికి.. 1.5 మిలియన్ డాలర్‌ మార్కును చేరుకుంది. 
 
ఇకపోతే, ఓవర్సీస్‌లో 1.5 మిలియన్ డాలర్లు దాటిన సినిమాలు ఎక్కువ ఉన్న హీరోల్లో ఎన్టీఆర్ రెండో స్థానంలో ఉన్నాడు. ఎన్టీఆర్ - సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'నాన్నకు ప్రేమతో' సినిమా 2.02 మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన 'జనతా గ్యారేజ్' 1.80 మిలియన్ డాలర్లను కొల్లగొట్టింది. ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న 'జై లవ కుశ' కూడా ఓవర్సీస్‌లో 1.5 మిలియన్ డాలర్ల మార్కును చేరుకుంది. మొత్తంగా మూడు 1.5 మిలియన్ డాలర్ల సినిమాలతో మహేశ్ తర్వాత ఎన్టీఆర్ ఓవర్సీస్ కింగ్ అనిపించుకుంటున్నాడు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

వారిద్దరూ రాజకీయాల్లోకి రావాలంటున్న తమిళ కమెడియన్

తమిళ సినీ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్‌లిద్దరూ రాజకీయాల్లోకి రావాలంటూ తమిళ హాస్య నటుడు ...

news

చిరంజీవికి ఏఆర్ రెహ్మాన్ షాక్... 'సైరా'కు గుడ్ బై

మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మించనున్న 151వ చిత్ర యూనిట్‌కు ...

news

సమంత పెళ్లి నెక్లెస్‌పైనే ఊరూవాడా చర్చ!

చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖుల ఇంట పెళ్లంటే ఊరువాడంతా సంబ‌ర‌మే. ఆ పెళ్లి గురించే పదేపదే ...

news

ఆ నటిపై మనసుపడిన రజనీకాంత్... నోరూరించే వంటకాలు చేయించారు

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ నటిపై మనసు పారేసుకున్నాడు. ఆ హీరోయిన్ కోసం రుచికరమైన ఆహార ...

Widgets Magazine