గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 19 జనవరి 2017 (17:57 IST)

జల్లికట్టు కోసం ఆస్కార్ అవార్డు గ్రహీత రెహమాన్ నిరాహార దీక్ష.. సెంటిమెంట్‌ను గౌరవిస్తూ..?

తమిళనాడు సంసృతికి అద్దం పట్టే జల్లికట్టు సాహస క్రీడపై నిషేధం విధించాలని ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడులో సంప్రధాయంగా నిర్వహించే జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలని తమిళనాడులోని ఐటీ ఉద్యోగులు, సిబ్బం

తమిళనాడు సంసృతికి అద్దం పట్టే జల్లికట్టు సాహస క్రీడపై నిషేధం విధించాలని ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడులో సంప్రధాయంగా నిర్వహించే జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలని తమిళనాడులోని ఐటీ ఉద్యోగులు, సిబ్బంది వెయ్యి మందికి పైగా పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి చెన్నైలోని మెరీనా బీచ్‌లో విద్యార్థులు పోరాటం చేస్తున్నారు. ఎండను సైతం లెక్క చెయ్యకుండా గంటలు గంటలు ధర్నాలో పాల్గొన్నారు.
 
ఈ నేపథ్యంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడులో జల్లికట్టుకు అనుకూల ప్రదర్శనలు పెద్ద ఎత్తున జరుగుతుండటంతో వారికి మద్దతుగా కీలక నిర్ణయం తీసుకున్నారు. జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలన్న తమిళ ప్రజల సెంటిమెంట్‌ను గౌరవిస్తూ శుక్రవారం ఒకరోజు నిరాహారదీక్ష చేయాలని నిర్ణయించారు. చెన్నైలో యువత పెద్ద ఎత్తున ఉద్యమించడంతో సినిమా, రాజకీయ ప్రముఖులంతా వారికి మద్దతిస్తున్నారు. తాజాగా రెహమాన్ కూడా ఒకరోజు నిరాహారదీక్ష చేయాలని నిర్ణయించడం సంచలనంగా మారింది