గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 21 జులై 2017 (10:49 IST)

బోయపాటి శీను స్టైల్ మారింది.. రొమాంటిక్ ఫీల్ మూవీ.. జయ జానకి నాయక టీజర్ అదుర్స్... (వీడియో)

ఎప్పుడూ యాక్షన్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన బోయపాటి శీను తన స్టైల్ మార్చేశాడు. రొమాంటిక్ ఫీల్ వున్న సినిమాను తెరకెక్కిస్తున్నాడు. 'జయ జానకి నాయక' అనే పేరిట సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే

ఎప్పుడూ యాక్షన్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన బోయపాటి శీను తన స్టైల్ మార్చేశాడు. రొమాంటిక్ ఫీల్ వున్న సినిమాను తెరకెక్కిస్తున్నాడు. 'జయ జానకి నాయక' అనే పేరిట సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు బోయపాటి రెడీ అయిపోయాడు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రెండో లుక్ యాక్షన్‌కి సంబంధించినది రిలీజ్ చేశాడు. అలాగే ఫస్ట్ టీజర్లో రొమాంటిక్ లవ్ ప్రాధాన్యత ఇచ్చిన ఆయన.. యాక్షన్ లవ్‌తో కూడిన సీన్స్‌ప రెండో టీజర్‌ను కట్ చేశాడు. 
 
ఈ టీజర్లో లైఫ్‌లో కష్టం వచ్చిన ప్రతీసారి లైఫ్‌ను వదులుకోం.. కానీ ప్రేమను మాత్రం వదిలేస్తాం. కానీ నేను వదులుకోను.. ఎందుకంటే నేను ప్రేమించా అంటూ హీరో చెప్పిన డైలాగ్ బాగా పేలింది. ఈ చిత్రంలో జగపతి బాబు విలనిజం అదిరిపోయింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోయిజంపై కట్ చేసిన ఈ టీజర్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.