Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఫలించిన రాయబారం... షూటింగ్‌కు హాజరుకానున్న జయసుధ

గురువారం, 1 డిశెంబరు 2016 (20:11 IST)

Widgets Magazine
jayasudha

సహజనటి జయసుధ, ఆర్‌.నారాయణమూర్తి కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం 'హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకట్రామయ్య'. కొద్ది రోజుల క్రితం ఈ చిత్రం చిత్రీకరణ సమయంలో నిర్మాతలకు, జయసుధకు మధ్య చిన్నపాటి వివాదం చోటుచేసుకుంది. దీంతో జయసుధ షూటింగ్ స్పాట్ నుంచి వాకౌట్ చేసింది. ఈ కారణంగా ఒక రోజు షూటింగ్‌ను రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
కాస్ట్యూమ్స్‌ డిజైనర్లు జయసుధ కాస్ట్యూమ్స్‌ని సరైన సమయానికి అందించలేదు. దీంతో ఆమె చాలా సమయం ఎదురుచూశారు. ఈ కారణంగా ఆమె సెట్‌కు వెళ్లలేదు. ఈ విషయం తెలియక నిర్మాత జయసుధ వ్యక్తిగత సిబ్బందిపై కేకలేశారట. తర్వాత జయసుధ నిర్మాతకు జరిగిన విషయాన్ని వివరించారు. గత 30 ఏళ్లుగా జయసుధ తన దుస్తులను తానే డిజైన్‌ చేయించుకుంటున్నారు. షూటింగ్‌కు ఒక రోజు ముందే ఆమె దర్శకుడితో తన దుస్తుల గురించి చర్చిస్తారు. 
 
కాగా, ఆమె సరిగ్గా సపోర్ట్‌ ఇవ్వడంలేదని నిర్మాతలు ఛాంబర్‌ దృష్టికి తీసుకుచ్చినట్లు తెలిసింది. దీనిపై పెద్దలు జోక్యం చేసుకుని ఫలప్రదం చేసినట్టు సమాచారం. దీనిపై గురువారం జయసుధ క్లారిటీ ఇచ్చినట్లు తెలిసింది. 'ఇది పెద్ద విషయం ఏమీ కాదు, చిన్న అపార్థం అంతే. దర్శకుడు నాకు ఫోన్‌ చేసి చిత్రం షూటింగ్‌ యథాతథంగా జరుగుతున్నట్లు చెప్పారు. షెడ్యూల్‌ ప్రకారమే ఈనె 3 నుంచి చిత్రం షూటింగ్‌ జరుగుతుంది' అని జయసుధ చెప్పినట్లు తెలిసింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

యూట్యూబ్‌లో 'ఖైదీ నంబర్.150' చిత్రం పాట రిలీజ్.. లక్షల్లో వ్యూస్..

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'ఖైదీ నెం.150' చిత్రం కోసం అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ...

news

సైకో థ్రిల్లర్‌గా 'భేతాళుడు' .. ఊహాజనితమైన కథతో 'బిచ్చగాడు'

సంగీత దర్శకుడు హీరోగా మారి చేసిన తమిళ చిత్రం తెలుగులో 'బిచ్చగాడు'గా సంచలన విజయం ...

news

"జయమ్ము నిశ్చయమ్మురా"... కరీంనగర్ టు కాకినాడ సక్సెస్ టూర్

విడుదలకు ముందు సుకుమార్, త్రివిక్రమ్, కొరటాల శివ, అనిల్ రావిపూడి, వక్కంతం వంశీ వంటి ...

news

'గౌత‌మీపుత్ర శాత‌కర్ణి'కి గుమ్మడికాయ కొట్టిన హీరో బాలకృష్ణ.. ఎందుకని?

గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి హీరో బాలకృష్ణ గుమ్మడికాయ కొట్టారు. దీంతో ఈ చిత్ర షూటింగ్ ...

Widgets Magazine