Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఎన్టీఆర్ బిగ్‌బాస్ షో.. రచ్చచేయడానికి వాళ్లిద్దరు చాలు...

గురువారం, 6 జులై 2017 (15:06 IST)

Widgets Magazine

హీరో జూనియర్ ఎన్టీఆర్ బుల్లితెరపై రాణించేందుకు సిద్ధమైపోయాడు. ఈనెల 16 నుంచి 'బిగ్‌బాస్' పేరుతో ఓ షో టెలికాస్ట్ కానుంది. ఇందులో 12 మంది సెలెబ్రిటీలు, 60 కెమెరాల మధ్య 71 రోజుల పాటు ఒకే ఇంట్లో కలిసి ఉండనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో ఒకటి తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో ఎన్టీఆర్ మాట్లాడుతూ 71 రోజుల పాటు ఒకే గదిలో ఉండే 12 మంది సెలెబ్రిటీలు... 60 కెమెరాల మధ్య ఒకే ఇంట్లో కొట్టుకుంటారో.. తిట్టుకుంటారో, ద్వేషించుకుంటారో.. ప్రేమించుకుంటారో.. మీతోపాటు చూసేందుకు నేనూ సిద్ధమని ఎన్టీఆర్ మాటలతో ప్రోమో ముగుస్తుంది. మరి ఈ కాన్సెప్ట్ తెలుగు ప్రేక్షకులకి ఏ మేరకు నచ్చుతుందో తెలుసుకోవాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
bigboss
 
ఇదిలావుంటే.. ఇందులో పాల్గొనే సెలెబ్రిటీలు ఎవరన్నదే కదా మీ సందేహం. ఇందులో పాల్గొనే సెల‌బ్రిటీస్ ఎవ‌ర‌నే దానిపై ఫిలిం న‌గ‌ర్‌లో జోరుగా చ‌ర్చ జ‌రుగుతుంది. ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం మేరకు.. మంచు లక్ష్మీ, స్నేహ, రంభ, పోసాని కృష్ణమురళితో పాటు సదా, ప్రముఖ మత ప్రచారకుడు కేఏ పాల్, కమెడియన్ ఆలీ, నటి మ‌ధుశాలిని త‌దిత‌రులు పాల్గొన‌నున్నార‌న్నది ప్రాథమిక టాక్. దాదాపు ఈ షోకి సినిమాతో పాటు బుల్లితెర‌పైన సంద‌డి చేసిన సెల‌బ్రిటీల‌నే తీసుకోవాల‌ని భావిస్తున్నార‌ట‌. 
 
కాగా, సోమ‌వారం నుండి శుక్ర‌వారం వ‌ర‌కు రాత్రి 9.30ని.ల‌కు.. శ‌ని, ఆది వారాల‌లో రాత్రి 9గంల‌కు ఈ కార్యక్ర‌మం స్టార్ మాలో ప్ర‌సారం కానుంది. ఈ షో కోసం తార‌క్ దాదాపు రూ.7 కోట్ల రెమ్యున‌రేషన్ ఒక్క సీజ‌న్‌‌కి డిమాండ్ చేసినట్టు సమాచారమ్. అయితే, ఈ షోకు ఎంపికైన సెలెబ్రిటీల్లో అందరి చూపూ ప్రధానంగా మంచు లక్ష్మీ, పోసాని కృష్ణమురళిలపైనే ఉంది. ఈ షోలో రచ్చ చేయడానికి వీరిద్దరే సరిపోతారని పలువురు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఆ జోకర్... అధికారాన్ని తప్పుడుదారిలో ఉపయోగిస్తున్నాడు : 'శంకరాభరణం' తులసి

మూవీ ఆర్టీస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజాపై 'శంకరాభరణం'లో నటించిన సీనియర్ నటి ...

news

సాయిధరమ్ మామూలోడు కాదు.. ఆమెను ఎలా వాడేస్తున్నాడో చూడండి (Video)

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన కుర్ర హీరోల్లో సాయిధరమ్ తేజ్ ఒకరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ...

news

బ్రేకప్ సాంగ్‌కు ఎలా డ్యాన్స్ చేసిందో చూడండి (Video)

అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని యువతీయువకులు తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. ప్రతి ...

news

ఆ కారణంగా ఓ తెలుగు హీరోతో ఆరేళ్ళు డేటింగ్ చేశా : ఇలియానా

తెలుగు చిత్రపరిశ్రమకు దిగుమతి అయిన ఇతర రాష్ట్రాలకు చెందిన భామల్లో ఇలియానా ఒకరు. ఈ గోవా ...

Widgets Magazine