శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 11 ఫిబ్రవరి 2017 (12:42 IST)

ఎన్టీఆర్ సినిమాకు అభయ్ రామ్ టెంకాయ కొట్టాడు.. తాత సాయం చేశాడు... వీడియో వైరల్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా శుక్రవారం ప్రారంభమైంది. ఈ సినిమాను బాబి దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ శుక్రవారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా శుక్రవారం ప్రారంభమైంది. ఈ సినిమాను బాబి దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ శుక్రవారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఎన్టీయార్‌ అన్న కల్యాణ్‌రామ్‌, తండ్రి హరికృష్ణ తదితరులు హాజరయ్యారు. అయితే ఈ ఫంక్షన్‌లో సెంటరాఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది మాత్రం ఎన్టీయార్‌ కొడుకు అభయ్‌ రామ్‌.
 
తన కుమారుణ్ని పెద్దగా బయటకు చూపించని ఎన్టీఆర్‌ ఈ సినిమా ఓపెనింగ్‌కు మాత్రం అభయ్‌రామ్‌ను తీసుకువచ్చాడు. ఆ ఫంక్షన్‌లో తను కూడా కొబ్బరికాయ కొట్టేందుకు ప్రయత్నించాడు అభయ్‌రామ్‌. ఆ సమయంలో తాత హరికృష్ణ వచ్చి అభయ్‌రామ్‌కు సహాయం చేశాడు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది.
 
ఎన్టీఆర్‌ హీరోగా ఆయన సోదరుడు కల్యాణ్‌రామ్‌ ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బేనరుపై నిర్మించే భారీ చిత్రం షూటింగ్‌ శుక్రవారం సంస్థ కార్యాలయంలో మొదలైంది. బాబీ ఈ చిత్రానికి దర్శకుడు. పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం దేవుని ఫొటోలపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు నందమూరి హరికృష్ణ కెమెరా స్విచాన చేయగా, ఎన్టీఆర్‌ తొలి క్లాప్‌ ఇచ్చారు. 
 
ఈ సందర్భంగా కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ ‘మా సోదరుని 27వ చిత్రాన్ని నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తాం. దర్శకుడు బాబీ చెప్పిన కథ ఎన్టీఆర్‌లోని స్టార్‌కీ, నటుడికీ న్యాయం చేసే విధంగా ఉన్నాయి. ఈ నెల 15 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుంది. ఒక హీరోయిన్ పాత్రకు రాశీఖన్నాను ఎంపిక చేశాం. ఈ ఏడాది ద్వితీయార్థంలో సినిమాని విడుదల చేస్తాం’ అని తెలిపారు.