Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఎన్టీఆర్ సినిమాకు అభయ్ రామ్ టెంకాయ కొట్టాడు.. తాత సాయం చేశాడు... వీడియో వైరల్

శనివారం, 11 ఫిబ్రవరి 2017 (12:02 IST)

Widgets Magazine

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా శుక్రవారం ప్రారంభమైంది. ఈ సినిమాను బాబి దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ శుక్రవారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఎన్టీయార్‌ అన్న కల్యాణ్‌రామ్‌, తండ్రి హరికృష్ణ తదితరులు హాజరయ్యారు. అయితే ఈ ఫంక్షన్‌లో సెంటరాఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది మాత్రం ఎన్టీయార్‌ కొడుకు అభయ్‌ రామ్‌.
 
తన కుమారుణ్ని పెద్దగా బయటకు చూపించని ఎన్టీఆర్‌ ఈ సినిమా ఓపెనింగ్‌కు మాత్రం అభయ్‌రామ్‌ను తీసుకువచ్చాడు. ఆ ఫంక్షన్‌లో తను కూడా కొబ్బరికాయ కొట్టేందుకు ప్రయత్నించాడు అభయ్‌రామ్‌. ఆ సమయంలో తాత హరికృష్ణ వచ్చి అభయ్‌రామ్‌కు సహాయం చేశాడు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది.
 
ఎన్టీఆర్‌ హీరోగా ఆయన సోదరుడు కల్యాణ్‌రామ్‌ ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బేనరుపై నిర్మించే భారీ చిత్రం షూటింగ్‌ శుక్రవారం సంస్థ కార్యాలయంలో మొదలైంది. బాబీ ఈ చిత్రానికి దర్శకుడు. పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం దేవుని ఫొటోలపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు నందమూరి హరికృష్ణ కెమెరా స్విచాన చేయగా, ఎన్టీఆర్‌ తొలి క్లాప్‌ ఇచ్చారు. 
 
ఈ సందర్భంగా కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ ‘మా సోదరుని 27వ చిత్రాన్ని నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తాం. దర్శకుడు బాబీ చెప్పిన కథ ఎన్టీఆర్‌లోని స్టార్‌కీ, నటుడికీ న్యాయం చేసే విధంగా ఉన్నాయి. ఈ నెల 15 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుంది. ఒక హీరోయిన్ పాత్రకు రాశీఖన్నాను ఎంపిక చేశాం. ఈ ఏడాది ద్వితీయార్థంలో సినిమాని విడుదల చేస్తాం’ అని తెలిపారు.


Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పెళ్లైన ఓ వ్యక్తి ఎంగేజ్‌మెంట్ అయ్యాక ప్రపోజ్ చేశాడు.. భార్యకు విడాకులిస్తానన్నాడు: లాస్య

బుల్లితెర మీద యాంకర్లు హాట్ హాట్‌గా కనిపిస్తూ.. వెండితెరపై తమ సత్తాను ...

తల వంచుకుని వెళ్లి, తలవంచుకుని ఇంటికి రా నాన్నా.. తైమూర్‌కు కరీనా హితబోధ

ఏ క్షణంలో తమకు పుట్టిన మగబిడ్డకు మంగోలు మహారాజు తైమూర్ అని కరీనా కపూర్‌ దంపతులు పేరు ...

news

పవన్ కళ్యాణ్‌ను దాటి నంది ముందుకెళుతుందా..!

నంది అవార్డుల కమిటీ చురుగ్గా పనిచేస్తోంది. దాదాపు ఐదేళ్ళ సుధీర్ఘ విరామం తర్వాత అవార్డులు ...

news

షాహిద్‌తో కాటేజీ షేర్ చేసుకోవాల్సిరావడం నాకో పీడకల: కంగనా రనౌత్

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుంటుంది. తాజాగా బాలీవుడ్ ...